ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 2014 నుంచి, ఈ సంవత్సరం మార్చ్ 13 దాకా చంద్రబాబుని ఆహా ఓహో అంటూ పొగిడిన పవన్, మార్చ్ 13 నుంచి సడన్ గా యూ టర్న్ తీసుకుని, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, అప్పటి నుంచి చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు గురించి పెద్దగా పట్టించుకోక పోయినా, అప్పుడప్పుడు చంద్రబాబు కూడా పవన్ పై చురకలు అంటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి, ఈ రోజు ఒకే కార్యక్రమంలో పాల్గుననున్నారు.  నేడు గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరుకానున్నారు.

ఈ ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పలకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  దేవాలయానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను విడివిడిగా వచ్చారు.
pawan cbn 22062018 3
ఆలయం వెలుపల ఉన్న టీవీ విజువల్స్ లో వీరు పలకరించుకోకపోవడం కనిపించింది. అయితే, లోపలకు వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పవన్ కల్యాణ్ అనుచరులు కూడా వారితో పాటు ఉన్నారు. వీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు పలకరించుకున్న విషయాన్ని వెల్లడించారు.  వీరిద్దరి మధ్య ఈ కుశలప్రశ్నల సన్నివేశం నిమిషం పాటు కొనసాగింది.

ఆ తర్వాత ఇద్దరూ నవధాన్యాలను విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో ఉంచారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించే సమయంలో... గణపతి సచ్చిదానందస్వామికి కుడివైపు చంద్రబాబు, ఎడమవైపు పవన్ కల్యాణ్ నిల్చున్నారు. ఎడమవైపు నుంచి తీర్థప్రసాదాలు ఇస్తున్న క్రమంలో, ముందు చంద్రబాబుకు ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: