మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు అయిన చిరంజీవి ప్రస్తుతం సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. గతంలో తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలవైపు చూడటం మానేశారు. అయితే తాజాగా ఒక షాకింగ్ న్యూస్ ఏమిటంటే చిరంజీవి తెలుగుదేశం పార్టీ లోకి రావడానికి తెగ ఉత్సాహం గా ఉన్నట్లు తెలుస్తుంది.

Image result for chiranjeevi politics

ఈ క్రమంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చిన నిధుల సాయం తో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర చేత తెప్పించుకుని అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఇదే క్రమంలో చిరంజీవి టైం లో వచ్చిన నిధులను ఏమాత్రం పక్కదోవ పట్టకుండా చంద్రబాబు చేసిన కార్యక్రమాల గురించి కూడా మంత్రి కొల్లు రవీంద్ర చిరంజీవికి తెలియజేశారు.

Related image

ఈ నేపధ్యంలో చిరంజీవి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరై తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట ఈ క్రమంలోనే తన సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర చేత రాయబారాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికలలో కాపుసామాజిక వర్గం ఓట్లను చీల్చారు.దీంతో టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. అయితే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల బట్టి చిరంజీవి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడే కరెక్టని తన సన్నిహితుల దగ్గర వాపోయారట.

Image result for chiranjeevi chandrababu

ఈ క్రమంలో ప్రతిపక్షనేత జగన్ కాపులపై కపట ప్రేమ ను చూపిస్తూన్నట్లు అభిప్రాయపడ్డారు కాబట్టి వారి ఓట్లను వైసీపీ వైపు పడేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డగించి చిరంజీవి కాపు ఓటు బ్యాంకు జగన్ వైపు వెళ్లకుండా ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు ఉండేలా రాష్ట్రం అభివృద్ది పడేలా చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క చిరంజీవి తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు కాపు నాయకులు సెటైర్లు వేస్తున్నారు...గతంలో ప్రజారాజ్యం పెట్టి మమ్మలను నిలువునా ముంచారు ...తన స్వార్థం కోసం ఇష్టానుసారంగా ఎవరి మాట బేఖాతరు చేయకుండా గతంలో చిరంజీవి ప్రవర్తించాడు. అలాంటి చిరంజీవి మాట విని గత ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి కాపు జాతిని తీవ్రంగా మోసం చేసిన చంద్రబాబుకి రాష్ట్రంలో ఏ కాపు సోదరులు మద్దతు ఇవ్వరు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: