ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రముఖ నటులు పవన్ కళ్యాన్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  అయితే పార్టీ తరుపున పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ పార్టీ ల తరుపున ప్రచారం కొనసాగించారు.  ఆ సమయంలో పవన్ కళ్యాన్ కి  మోడీ, చంద్రబాబు లతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే సంబంధం గత కొంత కాలం వరకు కొనసాగించిన పవన్ కళ్యాన్ ఒక్కసారే యూటర్న్ తీసుకున్నారు.  అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. 
Image result for chandrababu naidu pawan kalyan
ముఖ్యంగా చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వైసీపీతో జనసేన కుమ్మక్కయ్యిందని..ఈ రెండు పార్టీలను ఆడిస్తుంది కేంద్రమే అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్ర నేతలు పావుగంటపాటు సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.  శుక్రవారం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు-పవన్‌లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. 

అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. టీడీపీ వర్గాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో 15 నిమిషాలు కలిసి కూర్చుని మాట్లాడడం చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: