నగరంలోని టీచర్స్ కాలనీలోని సిల్వర్‌స్పూన్‌ హోటల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు కస్టమర్లు ఆస్పత్రిపాలయ్యారు. శుక్రవారం ఈ హోటల్‌లో బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.  స్ధానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. బెంగుళూరుకు చెందిన విజయ్‌, బాలకృష్ణ ఇద్దరూ ఆ రెస్టారెంట్‌కు వచ్చి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చారు. కొంత తిన్న తర్వాత ఆ ప్లేటులో బల్లి కనపడటంతో వారు ఒక్కసారిగా గందరగోళంలో పడి అస్వస్థతకు గురయ్యారు.  బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Lizard found dead in chicken biryani at Hotel
హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంపై వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్‌ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలికంగా సదరు హోటల్‌ను సీజ్ చేశారు.  అమరావతి ప్రాంతం రాజధాని కావడంతో ఇక్కడ అనేక హోటళ్లు వెలుస్తున్నాయి. కష్టమర్లు కూడా భారీగా ఉంటున్నారు. అయితే, హోటళ్ల యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కష్టమర్ల ఆరోగ్యంతో చెలగాటాలాడుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 

అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించాం. నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా మూసివేశాం. గతంలో విజయవాడలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలు ప్రముఖ హోటల్స్‌పైనా చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మా సిబ్బంది స్వయంగా విజయవాడ 14, విసన్నపేట 6, బందరు 3 చొప్పున జిల్లాలో సుమారు 25 కేసులు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: