ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ముఖ్యనేతగా ఎంతో హంగామా చేశారు దానం నాగేందర్.  తర్వాత సీఎం గా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ లో కీలక భూమిక పోషించారు.  ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అప్పుడప్పుడు టీఆర్ఎస్ పై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నా..తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడన్న వార్తలు తెలంగాణలో సంచలనంగా మారింది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులను ఎండగట్టారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టానని, హైదరాబాద్ మేయర్ గా కూడా పని చేశానని దానం నాగేందర్ చెప్పారు.  కాంగ్రెస్ లో ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని..ఒకప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒకే సామాజికవర్గానికి ప్రమోషన్ లు ఇస్తున్నారనే విషయాన్ని తాను ఆయనకే చెప్పానని... దీంతో, అప్పటి హోం  మంత్రి జానారెడ్డితో వైయస్ మాట్లాడుతూ, ఇలా చేస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారని గుర్తు చేశారు.
Image result for trs
కాంగ్రెస్ లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నొలకొందని చెప్పారు.  హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగినా నా భూజన వేసుకొని తిరిగేవాడినని..కానీ గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని చెప్పారు.   పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నా... ఇతర నేతలు ఆయనను పీతల్లాగా కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీనియర్ నేత వీహెచ్ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: