వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన చోట్ల ఉప ఎన్నికలు పెడితే టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందంట. ఇది విశాఖ జిల్లా మంత్రి  అయ్యన్న పాత్రుడి గారి చిలక జోస్యం. దీనికి కారణం ఏంటయ్యా అంటే ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలకు చిత్త శుధ్ధి లేదట. జనం టీడీపీ పోరాటాన్నే నమ్ముతున్నారట. పైగా వైసీపీ బీజేపీతో కుమ్మక్కు అయి ఉప ఎన్నికలు జరగకుండా చూసుకుని మరీ రాజీనామా చేసిందంట. 


పంచాయతీ ఎన్నికల సంగతేంటో..!
ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల మాట దేముడెరుగు, ఏపీలో అంతా గొప్పగా జనం బలం వుంటే పంచాయతీ ఎన్నికలు ముందు పెట్టించండి మంత్రి గారూ అంటూ సెటైర్లు పడుతున్నాయి. జూలై ఆఖరుకి సర్పంచుల పదవి ముగుస్తోంది. కానీ ఎన్నికలకు ఏపీ సర్కార్ రెడీగా లేదు. పైగా వాయిదా వేయాలనుకుంటోంది. మరి ఆ మాత్రం దమ్ము లేని వారు ఎంపీ ఎన్నికలు పెడితే వస్తే అంటూ కూనిరాగాలు తీయడమెందుకని  ఓ రేంజి లో విపక్షాలూ విరుచుకు పడుతున్నాయి.


ఆ ఎమ్మెల్యేతో రాజీనామాలు చేయించండి !
ఏపీలో టీడీపీఎకి తిరుగులేదని బీరాలు పోతున్న అయ్యన్న పాత్రుడు వైసీపీ నుంచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు సిధ్ధపడాలని వైసీపీ నాయకులు సవాలు చేస్తున్నారు. వూరకే మాటలు చెప్పడం కాదు, ధైర్యం వుంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని కౌంటర్లు ఇస్తున్నారు


ఎంతో చేశామంటున్న మంత్రి
ఏపీలో నాలుగేళ్ళ పాలనలో ఎంతో చేశామని అయ్యన్న అంటున్నారు. వైఎస్సార్ కేవలం రెండు వందలు రూపాయలు పించను ఇచ్చి ఎంతో ప్రచారం చేసుకుంటే వేయి రూపాయలు పించను ఇచ్చి కూడా తాము పబ్లిసిటీ కోరుకోవడంలేదని అయ్యన్న వాపోయారు. పధకాలతో పాటు జన్మ భూమి కమిటీల కధలు కూడా చెబితే మరింతగా ప్రచారం వస్తుందేమో చూడాలంటూ మంత్రి గారి వ్యాఖ్యలపై  పుంచ్ లు పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: