ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటు ఈసారి కూడా వలస పక్షుల పరమవుతుందని టాక్. అర్ధబలం, అంగబలం పుష్కలంగా వున్న అభ్యర్ధుల కోసం రాజకీయ పార్టీలు సెర్చ్ చేస్తున్నాయి. టీడీపీ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్టర్ క్రిష్ణారెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నట్లు భోగట్టా. జీవిఎంసీ ఎన్నికలు జరిగితే మేయర్ కావాలని ఆశ పడిన ఆయన ఆ మధ్య పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
Image result for yanamala ramakrishnudu
ఇపుడు ఏకంగా ఎంపీ సీటు మీదే కర్చీఫ్ వేశారు. దండిగా ఖర్చు చేస్తాడన్న ప్లస్ పాయింట్ తో అప్లికేషన్ పెట్టేశాడు. మరో వైపు ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సామజిక వర్గం బాగా వుండడం  కలిసివస్తుందని హై కమాండ్ లెక్క వేస్తోంది. అదే వరుసలో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇతర జిల్లాల పెద్దలు కూడా రేసులో వున్నారని టాక్. వీరిలో కార్పొరేట్లు, బిజినెస్ మాగ్నెట్లు , లాయర్లు, డాక్టర్లు,  ఫైవ్ స్టార్ హొటల్ ఓనర్లు మేమే ఎంపీ అంటున్నారు. 


వైసీపీ నుంచి అయనేనా..!
జగన్ పార్టీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఎంవీవీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ పేరు ముందు వరుసలో వుందంటున్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైనా కాకపోతే విజయసాయిరెడ్డిని ఖరార్ చేసే చాన్స్ వుంది. ఈ ఇద్దరూ కాకపోతే ఇతర పార్టీల నుంచి తెచ్చి మరీ గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ థింక్ చేస్తోంది.  అధికార పార్టీని తట్టుకోవడానికి డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్న్నది వైసీపీ ప్లాన్ 

Image result for haribabu mp

హరిబాబు తప్పుకుంటే అమెకే !
ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హరిబాబు పోటీ నుంచి తప్పుకుంటే పురంధరేశ్వరి రంగంలోకి దిగే చాన్స్ వుందంట. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఇక్కడే ఎంపీగా నెగ్గి సెంట్రల్ మినిస్టర్ కూడా అయిన హిస్టరీ అమెకుంది. దాంతో అమె వచ్చినా రావచ్చు అంటున్నారు.

ఆ సామాజిక వర్గాలకేనా...!
ముప్పయి ఏళ్ళ నుంచి ఆ రెండు కులాలే ఎంపీ సీటు పట్టుకుని వదలడం లేదని మిగిలిన వర్గాలు కస్సుమంటున్నాయి. అయితే రెడ్డి, లేకపోతే కమ్మ మరెవరూ లేరా అంటూ ఇతర కులాలలోని  లీడర్స్  ఫైర్ అవుతున్నారు. 1991 లో ఎంవీవీఎస్ మూర్తి టీడీఎపీ నుంచి ఎంపీ అయ్యారు. ఆ తరువాత రెండు మార్లు టీ సుబ్బరామిరెడ్డి ఎంపీ అయ్యారు. 1999లో మళ్ళీ మూర్తీ ఎంపీ అయ్యారు. 2004లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఎంపీ అయితే, 2009లో దగ్గుబాటి పురంధరేశ్వరి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ నుంచి హరిబాబు ఎంపీ అయ్యారు. ఇలా గెలిచిన వారు, ఓడిన వారు కూడా ఆ రెండు సామాజిక వర్గాల నుంచే  వుంటున్నారని బీసీ బలహీన వర్గాలు గుస్సా అవుతున్నాయి.


వలస నేతలు కూడా !
చిత్రంగా వీరంతా వలస నేతలు కూడా.  అంటే వ్యాపారాల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారన్న మాట.
అందువల్లనే విశాఖ సమస్యలు ఏవీ వీరికి పట్టడంలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఈసారి బీసీలకు, స్థానికులకు ఎంపీ టిక్కెట్లు ఇస్తేనే గెలిపిస్తామని అన్ని పార్టీలలోని క్యాడర్ అంటోంది. జనం మాట కూడా అలాగే వుంది. మరి ఈ దఫా ఏం మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: