పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఇక చింతమనేని వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన దేమీ లేదు ముందు నుంచి చింతమనేని దూకుడుగా వివాదాస్పదంగా నడుచుకునే వ్యక్తి అని చాలా సందర్భాలలో ఆయన వ్యవహరించిన ప్రవర్తననుబట్టి అర్థమవుతుంది. అయితే జిల్లాలోని ఎదురులేని టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని వచ్చేఎన్నికలలో ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు జిల్లాల్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు.
Image result for chintamaneni prabhakar
మరో పది మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆయనకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పాలి.ఆఖరికి టీడీపీ నేతలు కూడా చింతమనేనిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ హవా 1994 నుండి నడుస్తుంది. 2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఏలూరు ఎంపీ మాగంటి బాబు గెలిచారు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా యువకుడు, సౌమ్యుడు, వైసీపీ యూకే, యూరప్ కన్వీనర్ గా ఉన్న ఎన్నారై కొఠారి అబ్బయ్య చౌదరిని నియమించడం, ఆయన యూత్ లో దూసుకుపోతుండటంతో చింతమనేని అంత మెజారిటీతో గెలుస్తాడు, ఇంత మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పిన వారే ఇప్పుడు అసలు గెలిస్తే చాలని అంటుండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది.
Related image
గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నిలబడిన కారుమూరి నాగేశ్వరరావు గట్టిపోటినే ఇచ్చారు కానీ చివరాకరికి చింతమనేని 20 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే తాజాగా రాబోయే ఎన్నికలలో మాత్రం చింతమనేని గెలవడం కష్టమే అని దెందులూరు నియోజకవర్గం నుండి మాటలు వినబడుతున్నాయి.
Related image
దీనంతటికి కారణం చింతమనేని ప్రవర్తనే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు….సొంత నియోజకవర్గ ప్రజలను కొడుతూ ఇష్టమొచ్చినట్లు కులం పేరు పెట్టి దూషిస్తున్న నేపద్యంలో నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారట. ఓ పక్క వైసీపీ అధినేత జగన్ కూడా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంపై ఈసారి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారట...మొత్తం ఈ పరిణామాలను గమనిస్తుంటే వచ్చేఎన్నికలలో చింతమనేనికి గట్టి షాక్ ఇస్తున్నాడు జగన్...అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: