రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయాలలో అడుగుపెట్టి ఇటీవల ప్రజా పోరాట యాత్ర అంటూ ఉత్తరాంధ్రలో పర్యటించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే రంజాన్ పండుగ సందర్భంగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది లో ఎక్కువ మంది ముస్లిం మతానికి సంబంధించిన వారు వుండడంతో యాత్రకు బ్రేక్ చెప్పారు.
Image result for PAWAN KALYAN NADENDLA MANOHAR
ఈ క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి రాష్ట్ర రాజధాని సమీపంలో విజయవాడ నగరంలో అద్దె ఇంటిలో దిగారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇటీవల పవన్ కళ్యాణ్ దిగిన.. అద్దె ఇంటిలో పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా భేటీ అయ్యారు.
Image result for PAWAN KALYAN NADENDLA MANOHAR
అయితే గత కొంతకాలంగా నాదెండ్ల మనోహర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసినదే….ఈ నేపథ్యంలో పవన్కళ్యాణ్తో నాదెండ్ల మనోహర్ బేటి రాష్ట్ర రాజకీయాలలో అనేక చర్చలకు దారి తీసింది. ఇటీవల నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించారు...ఆ అంశాలపై పవన్‌తో చర్చించేందుకే భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
Image result for PAWAN KALYAN NADENDLA MANOHAR
సంవత్సరం వ్యవధిలో అసెంబ్లి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో జనసేన పొత్తు గురించి కూడా చర్చించేందుకే నాదెండ్ల మనోహర్‌ , జనసేనానిని కలిశారనే మరో సంచ‌ల‌న వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా జరిగిన వీరిద్దరి భేటీ గురించి కూడా జనసేన పార్టీ నాయకులు గానీ నాదెండ్ల మనోహర్ గానీ ఎక్కడా కూడా ఏ విషయం బయటకు చెప్పలేదు. ఈ విషయంపై ఎవరో ఒకరు నోరు విప్పితే గాని అసలు మేటర్ ఏం జరిగింది అన్నది తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: