2014 ఎన్నికలలో వైసిపి అధికారం కోల్పోవడానికి ప్రప్రథమ అయిన కారణాలలో ఒకటి పశ్చిమగోదావరి జిల్లా. గత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు...అంతేకాకుండా  ఎలక్షన్లో పోటీ చేసిన వారిలో ఆశించిన మేరకు మెజారిటీ కూడా సాధించలేదు. దీంతో ఈ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమున నేపద్యంలో గతంలో జరిగిన పొరపాటును భవిష్యత్తులో జరగకుండా వచ్చే ఎన్నికలలో జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
Image may contain: 4 people, people smiling, people sitting
నియోజకవర్గాల వారీగా ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఈ రిపోర్టులో జగన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఇక్కడ ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ నేతలు కార్యక్రమాలు చేపట్టలేదని తెలిసింది. ముఖ్యంగా ఇక్కడ ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించిన సమయంలో దానిని తమకు అనూకూలంగా మలుచుకోలేకపోడం వైసీపీ నేతలు స్పందించకపోడం వలన ప్రజలు అక్కడి వైసీపీకి అనుకూలంగా ఉండలేకపోయారు.
Image may contain: 3 people, people sitting, baby and outdoor
దీనితో అక్కడ నియోజకవర్గం నేతల సమన్వయ కమిటీతో చర్చించి పని చేసేవారికే టికెట్ అని ప్రకటించారని తాజాగా తెలిసిన సమాచారం. దీనితో వెంటనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకులతో పాదయాత్రలో బ్రేక్ సమయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్...
Image may contain: 5 people
ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ నాయకుల పై సీరియస్ అయ్యారు. దీంతో వెంటనే వైసీపీ నాయకులు భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని ఎన్నికలకు జిల్లాలో ఉన్న అన్ని స్థానాలను గెలుస్తామని జగన్ కి తెలియజేశారట. ఇలాంటివి మాటలలో కాదు చేతలలో చూపించాలని జగన్ వారికి వార్నింగ్ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: