ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరూ పట్టించుకోవటం లేదు.  ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వమే ప్రతిపక్షం చెసే పనులు చేస్తుంది. దాన్నే ప్రధాన మీడియా సమర్ధిస్తూ వార్తలు రాస్తుంది.  రాష్ట్రంలో అధికార పక్షం కూడా ప్రతిపక్షంగా మారి రకరకాల వీధి పోరాటాలకు సిద్ధమవటంతో,  అసలైన అధికార విపక్షం వైసీపీతో కలిసి రెండూ ప్రతిపక్షాలే కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ పాలన దాదాపు ముగిసిపోయింది. అయితే: 

chandrababu bjp cutif politics కోసం చిత్ర ఫలితం

బీజేపీ-వైసీపీలకు  రాజకీయ కూటనీతితో కూడిన రహస్య సంబంధాలు ఉన్నాయని ఆ రెండు పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని, టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. వారు తన  అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే, చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, చెప్పడం వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని వైసీపీ నేత కాకాణి గోవర్ధనరెడ్డి  ధ్వజమెత్తారు. 
chandrababu bjp cutif politics కోసం చిత్ర ఫలితం
బీజేపీ తో కటీఫ్ చెప్పినప్పుడు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ ను టిడిపి ప్రభుత్వ సలహాదారుగా ఎలా కొనసాగిస్తుందని  చంద్రబాబు ను ఆయన ప్రశ్నించారు. 

nirmala sitharaman with husband కోసం చిత్ర ఫలితం

బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ధిక ప్రణాళిక అడవుల శాఖా మంత్రిగా పనిచేస్తున్న సుధీర్ మునగంటివార్ భార్య సప్న మునగంటివార్ కు తిరుమల తిరుపతి దెవస్థాన పాలకమండలి లో సభ్యత్వమిచ్చి ఎలా కొనసాగనిస్తు న్నారని ప్రశ్నించారు.

సంబంధిత చిత్రం

ఇప్పటికీ  తెలుగుదేశం మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి  నిత్యం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ చుట్టూనే తిరుగుతున్నారంటూ విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని గోవర్ధనరెడ్డి అన్నారు.
sujana jaitly కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని గోవర్ధనరెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని గోల పెడుతున్నారు, ఇందులో భాగంగానే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అమిత్‌ షాను కలిశారనే ప్రచారం చేశారు. చివరకు ఆధారాలు లేక రామ్‌ మాధవ్‌ ను కలిసినట్లు మరో కట్టు కథ చెప్పే ప్రయత్నం చేశారు’ అని గోవర్ధనరెడ్డి అన్నారు.
kakani govardhan reddy photos కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, అందుకే ఢిల్లీలో బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి  ఎదో చేశారని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని కాకాణి గోవర్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. బుగ్గనపై మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. అధికారిక సమాచారాన్ని రాజేంద్రనాథ రెడ్డి ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారాయన.

బిజెపి నేత భర్తతో తెగతెంపులు చేసుకొని ఆమెతో - బిజెపి నేత భార్యతో తెగతెంపులు చేసుకొని ఆయనతో రాజకీయ సంభందాలు నెఱపటం బహుశ చంద్ర బాబు కే తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదేమో?  అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.  ఇదే  చంద్రబాబు దృష్టిలో బిజెపికి కటీఫ్ చేయటటం అన్నమాటని అన్నారు. 

chandrababu in totally insecured కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: