సాక్షాత్తు అధినేత చంద్రబాబు బుజ్జగించినా మంత్రి గంటాలో మార్పు రాలేదు సరి కదా నా రూటే సెపరేట్ అంటూ టీడీపీకి షాకులిచ్చేస్తున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి చిన రాజప్ప నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశానికి గంటా సారు  డుమ్మా కొట్టేశారు. అలక వీడినట్లు కనిపిస్తున్నే ఫ్యూచర్ పాలిట్రిక్స్ కు పదును పెట్టేస్తున్నారు. అలాగే, ఎంతో ఇంపార్టంట్ మీటింగ్ అని చెప్పినా  టీడీపీ సమన్వయ భేటీలో కూడా మంత్రి పాల్గొనకపోవడంతో సైకిల్ దిగేందుకే డిసైడ్ అయ్యారన్న టాక్ నడుస్తోంది.

Image result for chandrababu naidu

జనసేనానితోనేనా !
 
జనసేనాని పవన్ కళ్యాణ్ మలి విడత టూర్ విశాఖ జిల్లాలో 26 నుంచి స్టార్ట్ అవుతోంది పవన్ వెనక వున్నది గంటాయేనని ఇప్పటివరకూ ప్రచారం జోరుగా వుంది.  అసలు పవన్ తన టూర్ ని విశాఖ నుంచే మొదలెట్టాలి. కానీ  రూమర్స్ స్పీడ్ చూసి శ్రీకాకుళం టూర్ పెట్టుకోమన్నది కూడా మంత్రి అనుచరులేనని టాక్ బయటకు వచ్చింది. ఆ రెండు జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. ఇక ఇపుడు గంటా వారి ఇలాకాలోనే పవన్ యాత్ర సాగనుంది. సరైన టైం లో మంత్రి గారూ అలిగారు. ఇపుడు చూస్తే టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
Related image
ఏం జరగనుంది...!?

పవన్ టూర్ లో సంచనాలు చోటు చేసుకుంటాయా అన్న డవుట్స్ అందరిలో వున్నాయి చిరంజీవిని అన్నయ్య అని సంభోధించే గంటాకు పవన్ తమ్ముడే మరి. పైగా తన జిల్లాలో జనసేనాని టూర్. సక్సెస్ చేయడమే కాదు, సంచలనాలు చూపించాలి మరి టీడీపీ మీద ఓ రేంజిలో  ఫైర్ అవుతున్న గంటా పవన్ తో జత కడతారా. ఓపెన్ గానే సపోర్ట్ చేస్తారా, లేక సీక్రెట్ గా మంతనాలు జరుపుతారా. ఏమైనా గంటా కదలికలు ఇపుడు జిల్లాలో ఆసక్తి రేపుతున్నాయి .. వెయిట్ అండ్ సీ... 


మరింత సమాచారం తెలుసుకోండి: