ఈసారి  చంద్రబాబు పప్పులు ఉడకవని, గెలుపు సాధనాలు అన్నీ తమ వద్దనే వున్నాయని  వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అంటున్నారు.  ఇప్పటికి ఇపుడు ఎన్నికలు జరిగితే అధికారం తమదేనని కూడా గట్టిగా చెబుతున్నారు. . ఇపుడు అన్ని పార్టీలలోనూ ముందస్తు మాట బాగా వినిపిస్తోంది. ఎన్నికలు ఎపుడు వచ్చినా మేం రెడీ అంటూ నాయకులు ఢంకా బజాయించేస్తున్నారు తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ముందస్తు ఎన్నికలు రావచ్చునంటూ సంకేతాలు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే ఎన్నికలు ఆరు నెలలు ముందుకు జరిగినా అశ్చర్యం లేదంటున్నారు.

Image result for chandrababu naidu

వైసీపీదే విజయం 
ఎన్నికలు ఎపుడు వచ్చినా వైసీపీదే ఘన విజయమని విజయసాయి ధీమాగా చెబుతున్నారు. తమ పార్టీ అధినేత జగన్ చేపట్టిన పాద యాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. నాలుగేళ్ళ పాలనలో బాబు అన్ని రకాలుగా ఏపీనీ ముంచేసారని పంచ్ లు పేల్చారు. బాబుని మరో మారు భరించేందుకు జనం సిధ్ధంగా లేరని కూడా తేల్చేశారు. 


క్యాడర్ అలెర్ట్ గా వుండాలి 
ప్రజలు వైసీపీ వైపు వున్నా క్యాడర్ అలెర్ట్ గా వుండాలని విజయసాయి అంటున్నారు. ముఖ్యంగా బూత్ కమిటీలే కీలకమన్నారు. బూత్ లెవెల్ లొ కార్యకర్తలు ఒక్కొక్కరు ఇంటింటికీ తిరిగి బాబు సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రచారం చేయడమే కాదు, ఓట్లు కూడా వేయించాలన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. 

Image result for tdp

సంస్థాగతంగా పటిష్టం
వైసీపీ ఇపుడు బలంగానే వుందని, సంస్థాగతంగా దీటుగా టీడీపీతో డీ కొట్టే స్థాయిలో  వుందని విజయసాయి అంటున్నారు.  జగన్ తరువాత పార్టీలో నంబర్ టూ గా వున్న అయన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వైసీపీ బలాన్నీ, బలహీనతలను అంచనా వేస్తూ మెజారిటీ సీట్లు సాధించేలా వ్యూహరచన చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: