జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు నర మానవుడికి కూడా అర్ధం కావడం లేదన్న సంగతీ అందరికీ తెలిసిందే. అయన పూటకో మాట చెప్పి ట్విట్టర్ లో మరో మాట చెప్పి జనాలను గందర గోళం లోకి నెట్టడం జనసేన అధినేత కు అలవాటయిన పనే. అయితే పవన్ కళ్యాణ్ కు మాట నిలకడ లేకపోవడం వల్లనా ఆ పార్టీ  మీద జనాలకు ఇంకా పూర్తి స్థాయి లో నమ్మకం కుదరడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పడూ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మానవులుకు అర్ధం కావడం లేదు. 

Image result for janasena pawan kalyan

ప్రత్యేక  హోదా డిమాండ్‌ చేస్తూ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పవన్‌ కొన్ని పోరాట కార్యక్రమాలు చేశాడు.  జనసేనతో పొత్తు గురించి సీపీఎం అదే పనిగా మాట్లాడకపోయినా, సీపీఐ మాత్రం తహతహలాడిపోతోంది. ఆ పార్టీ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఎప్పుడూ జనసేనతో పొత్తు గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోరాట యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన పవన్‌ జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని, మొత్తం 175 సీట్లలో బరిలోకి దిగుతామని ప్రకటించాడు.

Image result for janasena pawan kalyan

 జనసేన పొత్తులు పెట్టుకోదని పవన్‌  ప్రకటించాక కూడా జనసేన, లోక్‌సత్తాతో కలిసి కూటమి కడతామని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆమధ్య మీడియాకు చెప్పారు. ఒంటరి పోటీ అని పవన్‌ చెప్పాక రామకృష్ణ ఇలా ఎందుకు చెప్పారో తెలియదుగాని చివరకు పవన్‌ దాన్నే నిజం చేశాడు. లెఫ్ట్‌ పార్టీలతో కలిసి ముందుకు సాగుతానని తాజాగా ప్రకటించాడు. 'సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తాయి. వామపక్షాలదీ, నాదీ ఒకటే ఆలోచనలు, ఒకటే భావజాలం' అన్నాడు పవర్‌స్టార్‌. అయితే ఇప్పటివరకు ఒంటరి పోరాటం అని చెప్పి ఇప్పడూ మళ్ళీ కూటమి అని చెప్పే సరికే జనసైనికులుకు కూడా ఏమి అర్ధం కావడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: