వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రరాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. జగన్ పాదం పెట్టిన ప్రతిచోటా రాష్ట్ర ప్రజలు జగన్ ని ఆదరిస్తూనే వస్తున్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరు జగన్ని ఆప్యాయంగా పలకరిస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా వచ్చే ఎన్నికలలో  జగనే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ జగన్ వైసిపి ఐ.టి విభాగంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Related image
అయితే వీరంతా బెంగుళూరు నుంచి రావడం, వారితో జగన్ భేటీ అయ్యి పలు అంశాల మీద చర్చించటం జరిగింది. ఇప్పుడు ఇది అంతటా చర్చనీయాంశంగా మారింది.ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వైసీపీ ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసింది. వీరు తమ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసే అవినీతి, ప్రజా వెతిరేక పనుల గురుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నారు.
Image result for chandrababu prashant kishor
తాజాగా జరిగిన ఈ సమావేశానికి మూడువేల మంది హాజరయ్యారు ఈ క్రమంలో వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశానికి హాజరైన వారికి సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను సామాన్యుడికి ఎలా అర్థమయ్యేలా వర్క్ చేయాలో వంటి విషయాలపై పగడ్బందీగా పక్కా ప్రణాళికలతో దిశానిర్దేశం చేశారు.
Image result for chandrababu prashant kishor
దీంతో ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతల గుండెలలో ఓటమి భయం పట్టుకుంది అని అంటున్నారు. మామూలుగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమార్కులు వీడియోల ద్వారా బయటకు మీడియాకు వచ్చేస్తున్నాయి...ఇక ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అంటే చంద్రబాబుకి అప్ అండ్ డౌన్ అదిరిపోయినట్టే అని అంటున్నారు రాజకీయ పండితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: