ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో సర్వేల గోల మొదలయ్యింది. తాజాగా ఇటీవల తెలుగుదేశం అధినేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఇటీవల ఓ ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే తాజాగా జరిగిన సర్వేలో వచ్చిన ఫలితాలు చూసి తెలుగుదేశం నాయకులు షాక్ తిన్నారు.
Image result for chandrababu
గతంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల వారీగా ఒకసారి గ్రాఫ్ గమనిస్తే సొంత జిల్లా నేత అయిన స్థానిక ప్రజలు అనుకున్నంత స్థానాలు ఇవ్వలేదు చంద్రబాబు గారికి. 2004-2009 ఎన్నిక‌ల్లో అనుకున్నంత విజ‌యం అయితే ఇక్క‌డ ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు టీడీపీకి…2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తెలుగుదేశం ఇక్క‌డ త‌న విజృంభ‌న చూపింది.. కాని ఆరుసీట్లు మాత్ర‌మే గెలుచుకుంది… అయితే వైసీపీ కూడా జిల్లాలో 8 స్దానాల్లో విజ‌యం సాధించింది.
Image result for chandrababu
14 సెగ్మెంట్ల‌లో ఎనిమిది వైసీపీ 6 తెలుగుదేశం గెలుచుకుంది గ‌త ఎన్నిక‌ల్లో.. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఈ ఫ‌లితాలు మ‌రింత తారుమారు అవుతాయాని ఓ స‌ర్వే తేల్చుతోంది..11 సెగ్మెంట్లు వైసీపీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఇటు టీడీపీ మూడు సీట్ల‌తో స‌ర్దిపెట్టుకుంటుంది అని ఆ స‌ర్వే వైర‌ల్ అవుతోంది.
Related image
ఇక ఎంపీలు కూడా రెండు స్ధానాల్లో తిరుప‌తి నుంచి వ‌ర‌ప్ర‌సాద్ కు విజ‌యం మ‌రోసారి జ‌గ‌న్ సీటు ఇస్తే క‌చ్చిత‌మ‌ని, అలాగే మ‌రో సెగ్మెంట్ పై ట‌ఫ్ వార్ ఉంటుంది అని తెలుస్తోంది. సో ఈ స‌ర్వేతో కొత్త ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయ‌ట టీడీపీలో. మరోపక్క స్థానికంగానే ఇలా ఉంటే ఇక రాష్ట్రం మొత్తం దుకాణం సర్దుకోవాల్సిందే 2019 లో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: