జేసి దివాకర్ రెడ్డి అనంత పురం లో బలమైన నాయకుడు కేవలం తన పాపులారిటీ తో పార్టీ తో సంభందం లేకుండా గెలవగలిగే సత్తా ఉన్న నాయకుడు. అందుకే 2014 లో చంద్ర బాబు నాయుడు ఏరి కోరి జేసి కి టికెట్ ఇచ్చినాడు. అయితే జేసి కి స్థానిక ఎమ్మెల్యేలకు పడటం లేదని టాక్ నడుస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో తన కొడుకును దింపాలని జేసి కోరికని క్లియర్ గా అర్ధం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే బాబుకు మరియు లోకేష్ కు కూడా భజన చేసే విధముగా దిగ జారిపోయాడని చెప్పవచ్చు. 

Image result for jc diwakar reddy

 ఇప్పుడు జేసీ తపనంతా కొడుకు విషయంలో మరి. వచ్చేసారి తనయుడు ఆరంగేట్రం చేయబోతున్నాడు. అది కూడా అనంతపురం ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. అతడికి పుషప్‌ ఇవ్వాలి. ఒకవేళ తనయుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీచేస్తే జేసీకి ఇంత టెన్షన్‌ ఉండేది కాదు. అతడు పోటీ చేయబోతున్నది అనంతపురం ఎంపీగా కాబట్టి.. ఏడు నియోజకవర్గాల పరిధిలో సత్తా చూపించాల్సి ఉంటుంది. అందుకే జేసీ చాలా టెన్షన్‌గా కనిపిస్తున్నాడు. రిటైర్మెంట్‌ సమయంలో జేసీ ప్రశాంతంగా కనిపించకపోవడడానికి కారణం ఇదే.

Image result for jc diwakar reddy

రేపు దండిగా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అందులో ముఖ్యమైనది. ఆపై సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో జేసీ సున్నం పెట్టుకున్నాడు. తెలుగుదేశంలో జేసీని ఇప్పుడు మెచ్చుకునే ఎమ్మెల్యేలు లేరు. రేపు మళ్లీ వీళ్లే పోటీచేస్తే.. అంతే సంగతులు. వీళ్లే దగ్గరుండి జేసీ తనయుడిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఎమ్మెల్యే ఓటు టీడీపీకి, ఎంపీ ఓటు వైసీపీకి వేసుకోండని ప్రచారం చేసినా చేస్తారు. అందుకే ఇప్పుడు జేసీలో టెన్షన్‌ పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు పోటీచేసినా తన తనయుడికి ఎన్నికల సమయంలో సహకరించరు అని జేసీకి అర్థమైపోయింది. అందుకే మొత్తం కొత్త వాళ్లను పెడదాం.. అది కూడా తను చెప్పిన వాళ్లను పెడదామని జేసీ బాబు వద్ద పోరుతున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: