గంటా శ్రీనివాస్ టీడిపీ మీద అలిగిన సంగతి తెలిసిందే. అయితే గంటా శ్రీనివాస్ ను బుజ్జగించడానికి చాలా మందిని టీడీపీ రంగం లోకి దింపింది. అయితే గంటా శ్రీనివాస్ మొదట్లో తగ్గినట్లు కనిపించినప్పటికీ గంటా పార్టీ మారడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.  తనపై ఇక ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని అధిష్టానానికి గంటా విస్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం మంచి ముహూర్తం కోసమే తను వెయిట్ చేస్తున్నానని, ఆ టైమ్ వచ్చినప్పుడు జంప్ కొట్టడం గ్యారెంటీ అని టీడీపీ కీలక నేతలకు గంటా చూచాయగా చెప్పేశారు. దీంతో అతడిపై టీడీపీ ఆశలు వదులుకుంది.

Image result for ganta srinivasa rao

అయితే గంటా ఉన్నఫలంగా మరోసారి పార్టీ మారే ఆలోచన చేయడం వెనక బలమైన కారణం కనిపిస్తోంది. కేవలం తనకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడం పైకి చెప్పే సాకుగా మాత్రమే కనిపిస్తోంది. అసలు కారణం ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును కూడా ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారట గంటా. తండ్రికొడుకులు ఇద్దరికీ సీట్లు రావాలంటే అది టీడీపీలో సాధ్యం కాదు.

Image result for ganta srinivasa rao

మరీ ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు ఉన్నంత కాలం ఇది అస్సలు జరగని పని. గంటాతో పాటు అతడి కొడుక్కి కూడా సీటు ఇస్తే అయ్యన్నపాత్రుడు అడ్డుతగలడం గ్యారెంటీ. అందుకే గంటా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గంటా టీడీపీని వీడితే విశాఖ, నర్సీపట్నం ప్రాంతాల్లో అయ్యన్నపాత్రుడి వర్గానిది మరోసారి పైచేయిగా నిలుస్తుంది. కానీ టీడీపీని వీడిన గంటా, తిరిగి అదే ప్రాంతం నుంచి పోటీ చేస్తే మాత్రం అది కచ్చితంగా టీడీపీకి, అయ్యన్నపాత్రుడికి దెబ్బ. మరోవైపు తన కొడుకు విజయ్ ను కూడా ఈసారి ఎమ్మెల్యేను చేయాలని అయ్యన్నపాత్రుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: