తెలుగుదేశంపార్టీ ఏడుపేమిటో ఎవ‌రికీ, ఎంత‌కీ అర్ధం కావ‌టం లేదు. ఇర‌వై నాలుగు గంట‌లూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ప‌డి ఏడ‌వ‌టం త‌ప్ప ఇంకేమీ చేయ‌టం లేదు. తాజాగా చంద్ర‌బాబునాయుడు ఆ పార్టీ నేత‌ల‌కు చేసిన దిశా నిర్దేశం చూస్తే అదే అర్ద‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రిగా త‌న వైఫ‌ల్యాల‌ను చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌పై నెట్టేందుకు  చేస్తున్న ప్ర‌య‌త్నం చాలా చ‌వ‌కబారుగా ఉంది. 


జ‌గ‌న్, గాలి, బిజెపి లాలూచీ చెప్పాల‌ట‌

Image result for gali janardhan reddy ys jagan and bjp

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు డిమాండ్ తో టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు ఐదే రోజులుగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే . ఆ విష‌యాన్ని రాష్ట్ర‌మంత‌టా చాటింపు వేయాలని చంద్ర‌బాబు చెబుతున్నారు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. రెండు రోజుల పాటు ఆందోళ‌న‌లు చేయాల‌ని చెప్ప‌టం కూడా ఓకేనే. త‌ర్వాత మాట్లాడిన విష‌యాలు చాలా చ‌వ‌క‌బారుగా ఉంది. ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ముందుకొచ్చిన గాలి జ‌నార్ధ‌న రెడ్డి, వైఎస్ జ‌గ‌న్, బిజెపి లాలూచీ రాజ‌కీయాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌న్నారు. 


అప్ప‌ట్లో ఫ్యాక్ట‌రీని అడ్డుకుందే టిడిపి

Related image

ఇక్క‌డ లాలూచీ ఏముంది ?  ఫ్యాక్ట‌రీ క‌ట్ట‌టానికి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కి ప్ర‌భుత్వం ఎప్పుడో అనుమ‌తి ఇచ్చింది.  కాక‌పోతే త‌ర్వాత జ‌రిగిన  ప‌రిణామాల్లో ఫ్యాక్ట‌రీ నిర్మాణం అట‌కెక్కింది. అయితే అప్ప‌టికే  సుమారు వెయ్యికోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌న‌ని గాలి చెబుతున్నారు. కాబ‌ట్టి ఫ్యాక్ట‌రీ పెట్టే అవ‌కాశం త‌న‌కే ఇవ్వాల‌ని అడుగుతున్నారు. అందులో త‌ప్పేంటో అర్ధం కావ‌టం లేదు. గాలి ఫ్యాక్ట‌రీ నిర్మాణం మొద‌లుపెట్టిన‌పుడు ప‌నుల‌ను అడ్డుకున్న‌దే ప్ర‌తిప‌క్షంలో ఉన్న టిడిపి. అక్క‌డ సెల ఏర్లున్నాయ‌ని, వ‌న్య  ప్రాణుల‌న్నాయ‌ని, ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంద‌ని ఏవో  చెప్పి మీడియాలో క‌థ‌నాలు రాయించింది అప్ప‌ట్లో ఇదే టిడిపి.


చీప్ పాలిటిక్స్

Related image

ఇపుడేమో జ‌గ‌న్, గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కోస‌మే కేంద్రం ఫ్యాక్టరీ ఏర్పాటును ఆల‌స్యం చేస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. అస‌లు చేసే ప‌నుల‌కు, చెబుతున్న మాట‌ల‌కు ఏమ‌న్నా పొంత‌న ఉంటోందా ?  40 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ అని త‌ర‌చూ చెప్పుకునే చంద్ర‌బాబు కూడా ఇంత‌టి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తుంటే ఏమ‌నుకోవాలో అర్ధం కావ‌టం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: