సాధారణంగా వివాహ వేడుకలో పెద్దలు, చిన్నలు సంతోషంగా డ్యాన్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు.  ఇక పెళ్లైన కొత్త జంట బారాత్ తీసే సమయంలో తీన్మార్ వేస్తూ కోలాహలంగా డ్యాన్స్ లు వేయడం..అల్లరి చేయడం సర్వసాధారణం.  ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, పొలిటీషియన్లు ఏది చేసినా వైరల్ అవుతుంది. 

రీసెంట్ గా ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యారు సంజయ్ శ్రీ వాస్తవ..అందరూ అయన్ని డ్యాన్సింగ్ అంకుల్ అని అంటున్నారు.  శ్రీవాస్త ఎంతగా పాపులర్ అయ్యారంటే..బాలీవుడ్ హీరోలు సైతం ఫిదా అవుతూ ఆయను తెగ మెచ్చుకుంటున్నారు.  తాజాగా ఓ వివాహ వేడుకలో జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ చిందేశారు. 
Image result for dancing uncle
సామూహిక వివాహా వేడుకలో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఈమెంట్‌కు ఆయన హాజరయ్యారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రఘుబర్ దాస్.. స్థానిక గిరిజన తెగలతో కలిసి స్టెప్పులేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: