మొన్నటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి రెండు పార్టీలు నానా హంగామా చేశాయి. ఇప్పడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ విచిత్రంగా జగనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ని ఆడుకున్నాడని విమర్శలు చేస్తున్నాడు. ప్రతి విషయం లో జగన్ మీద విమర్శలు చేసి టీడీపీ పబ్బం గడుపుతుందని అనుకోవాలి. నిజం చెప్పాలంటే నాలుగేళ్లు నుంచి టీడీపీ కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి బీజేపీ ని గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడేమో దీక్షలు అంటూ హడావిడి చేస్తున్నారు. 

Image result for jagan chandrababu

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ స్టీల్ ప్లాంటు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ ప్రాతిపదికన మాట్లాడుతోంది? గతంలో చేసింది ద్రోహమా? ఇప్పుడు చేస్తున్నది ద్రోహమా? తెలుగుదేశం అసలు వేషం ఏది? జగన్ కోసం, గాలి కోసం అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును కేంద్రం ఆలస్యం చేస్తోందని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. మంత్రులు ఇదే మాట మాట్లాడారు.

Image result for jagan chandrababu

ఇంతకీ తెలుగుదేశం పార్టీ బాధేంది? మొన్నటి వరకూ నేమో.. అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం నో చెప్పింది. జగన్ కు కూడా ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడేమో.. జగన్ కోసం కేంద్రం ఆలస్యం చేస్తోందని అంటున్నారు. ఈ మాటల్లో నిజానిజాల సంగతేమో కానీ.. తెలుగుదేశం మాటలను బట్టి చూస్తే వైఎస్సార్సీపీ అధినేత అధికారంలో లేకున్నా అన్నీ చేయగలుగుతున్నాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం.. కేంద్రంలో, రాష్ట్రంలో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాడు. దేన్నీ సాధించలేకపోతున్నాడు. ఇదీ తెలుగుదేశం ఒప్పుకుంటున్న విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: