పవన్ కళ్యాణ్ చంద్ర బాబు తో భేటీ అవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇప్పటి వరకు చంద్ర బాబు మీద ఓ రేంజ్ లో విరుచుకుపడి చివరికి లోకేష్ మీద కూడా విమర్శలు కురిపించాడు. టీడిపి మీద అవినీతి ఆరోపణలు కురిపించాడు. ఓ దశలో ప్రధాన ప్రతి పక్షం అయినా వైసీపీ కంటే పవన్ కళ్యాణ్ విమర్శలే ఎక్కువని చెప్పవచ్చు. అయితే ఉన్నట్టు ఉండి పవన్ కళ్యాణ్ చంద్ర బాబు తో భేటీ అవడం తో పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ మీద సందేహాలు మొదలయినాయి. 

Image result for chandra babu and pavan kalyan

2019 ఎన్నిక‌లు త‌రుముకొచ్చేస్తున్నాయి. పోయిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క‌టి కూడా చంద్ర‌బాబు సంపూర్ణంగా అమ‌లు చేయ‌లేదు. దానికితోడు పాల‌నా వైఫ‌ల్యాలు, పెరిగిపోయిన అవినీతి లాంటి అనేక అంశాలు చంద్ర‌బాబు పాల‌న‌పై జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెంచేస్తోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర పేరుతో జ‌నాల్లో దూసుకుపోతున్నారు. జ‌నాలు కూడా జ‌గ‌న్ కు బ్ర‌హ్మ‌ర‌ధం పడుతుండ‌టంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది.

Image result for chandra babu and pavan kalyan

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నీ స్దానాల్లోను జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌టం లేదు. ఎందుకంటే, రాష్ట్ర‌మంతా తిరిగి అభ్య‌ర్ధుల కోసం ప్ర‌చారం చేసేంత ఓపికి ప‌వ‌న్ లో లేదు. ఆ విష‌యం మొన్న శ్రీ‌కాకుళం జిల్లాలో మొద‌లైన ప్ర‌జా పోరాట యాత్ర‌తోనే తేలిపోయింది. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం ఎంపిక చేసిన‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ట‌. అవికూడా వైసిపి క‌చ్చితంగా గెలిచే నియోజ‌క‌వ‌ర్గాలే అయ్యుంటాయ‌నే ప్ర‌చారం మొద‌లైంది. అంటే సుమారు 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌ పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఇదంతా వ‌ర్క‌వుట‌వ్వాలంటే మ‌రికొంత కాలం ప‌ట్ట‌వ‌చ్చు. 




మరింత సమాచారం తెలుసుకోండి: