Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: చంద్రబాబు టిడిపి ని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా?

ఎడిటోరియల్:  చంద్రబాబు టిడిపి ని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా?
ఎడిటోరియల్: చంద్రబాబు టిడిపి ని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మరీ క్షీణిస్తూ "మహానది చిన్న నీటిజాలు" గా మారుతున్నట్లుంది.  దేశంలోనే నాలుగవ పెద్ద రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు కనీసం ఇప్పుడు ఏనిమిదవ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించలేక చతికిలపడటం ఆయనకు సిగ్గుచేటు.  నాడు నలభైరెండు పార్లమెంట్ సభ్యులను కేంద్రానికి పంపించిన రాష్ట్రం ఇప్పుడు 25 మంది ఎంపిలను కలిగి ఉంది. ఇంత చిన్న రాష్ట్రాన్ని పునర్నిర్మిం చటం కష్టం కాదు.


దానికి కావలసింది సంకల్పం, నిబద్ధత, సంయమనం, నిస్వార్ధం, కలుపుకు పోగల వ్యక్తిత్వం, ప్రతిపక్షాన్ని సైతం అక్కున చేర్చుకుపోగల దాతృత్వం, రాజకీయం కాకుండా రాజనీతి (కూటనీతి మాత్రం కాదు) ఉండవలసిన చోట  పనిచేయలేని అసమర్ధమంత్రులు, తమ నాయకుణ్ని ఏవరైన విమర్శిస్తే మద్దతు మీడియాను అడ్డుపెట్టుకుని చేసే దాడి రౌడీయిజం ను మరిపిస్తుంది, ఒకరికొకరికి సంయమనం లేకపోవటం, సభాపతి నుండి మంత్రులు ఇతర నాయకుల వరకు కనీసం ఒకరైనా నిస్వార్ధంగా పనిచేయక పోవటం - ఇవే తిరిగి టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వని అంశాలు. చివరకు మద్దతు మీడియా విపరీత జోక్యమే ప్రభుత్వ పతనానికి తొలి పునాది రాయి అవుతుంది.  

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

*సచివాలయం చాలా పవిత్రమైన దేవాలయమట. అందులోకి వేరే వారు రాకూడదట. ప్రజాస్వామ్య ప్రపంచంలో నలభైయ్యేళ్ళ సుధీర్ఘ అనుభవం గడించి – ఐదుగురు అనామాకులను ప్రధానులుగా కేంద్రలో కూర్చోబెట్టిన ఘనుడాయన (ఇది రాజకీయ మగానుబావుడు లోకేష్ నాయుడు గారి ఉవాచ)


*ఇదేమైనా చేపల మార్కెట్టా? మీ సంగతి చూస్తా? అని కూడా ఆయన బిసి వర్గంలోని నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి చేసిన బెదిరింపు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలకు సేవకుడు అవుతారు తప్ప దేవుడు కారు కానేరరు. ప్రజలందరి మన్ననలు పొంది దేవుడు అనిపించుకోవాలి కాని,తనకు తానే దేవుడిగానో, అవతారంగానో ఊహించుకుని తన సచివాలయంలోకి  ఎవరూ రారు, రాకూడదు, రారాదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అనవచ్చా?


*సచివాలయం ఎవడబ్బసొత్తు కాదు! ప్రజాధనంతో నిర్మించిన ప్రజలకు సేవ చేయటానికి ఉద్దేశించిన కార్యాలయాల సముదాయం.  తమ కష్టాలు చెప్పుకుని, వాటి పరిష్కారం కోసం భారతీయుడు ఎవరైనా సచివాలయానికి వెళ్లవచ్చు.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

*కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా కుదరదని అంటున్నారు. నాయీ బ్రాహ్మణులంటే చిన్నచూపా? లేక ఇంకేదైనా కారణముందా?  తెలియదు కాని ఆయన మరోసారి వెనుబడిన తరగతుల వారిని తీవ్రాతి తీవ్రంగా అవమానిం చారు. తమ ఆత్మ గౌరవం దెబ్బతినేలా చంద్రబాబు ప్రవర్తించారని నాయీ బ్రాహ్మణులు నేరుగా అంటున్నా రంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.


సచివాలయం సంగతేమో కాని, భగవంతుని సన్నిధానంలో నాయీ బ్రాహ్మణులు నిత్యం ఉంటారు.వారి సేవలు అందిస్తారు. మంగళ వాయిద్యాలు వాయిస్తారు. అందరికి శుభకరంగా ఉండాలని వారు తమకు శహస్రాబ్ధాల నుండి నైపుణ్యమున్న కళ ద్వారా ప్రార్దిస్తారు. భక్తుల మొక్కి భగవానునికి ఇచ్చిన తలనీలాలను తీస్తారు. పుణ్యక్షేత్రాలలో ఉండే నాయి గ్రాహ్మణులు తన సచివాలయంలోకి రావద్దని చంద్రబాబు చెప్పగలిగారంటే ఏమను కోవాలి


నాయీ బ్రాహ్మణులు వారంతట వారు అక్కడకు వెళ్లలేదు. రాష్త్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆహ్వానంతో వారు అక్కడికి వెళితే వారికి సమస్య పరిష్కారం కాలేదు. పైగా కె.ఇ.కృష్ణమూర్తి డమ్మీ ఉప ముఖ్యమంత్రి మాత్రమేనని ఆయనకు అధికారాలు లేశమాత్రమూ లేవన్న సంగతి వారికి పూర్తిగా అర్దమైపోయింది.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

అంతేకాదు తాను చంద్రబాబుకు చెప్పాల్సి ఉందని, అందువల్ల మరికొన్నాళ్లు ఆగాలని అంతటి సీనియర్ నేత తనపరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారంటే టిడిపి ప్రభుత్వం మహారాజాధి రాజు చంద్రబాబు రాజేంద్రుల వారు ఎంత ఏకచత్రాదిపత్యంగా పనిచేయిస్తున్నారో అక్కడున్న నాయీ బ్రహ్మణులకే కాదు అది విన్న ఇక్కడి సకల జనులకు అర్దమై పోయింది.


బిసి వర్గానికే చెందిన కె.ఈ .కృష్ణమూర్తి ఎంతగా ఆత్మాబిమానం వదిలేసి వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పనిచేస్తున్నారో తెలిసి పోతుంది. కె.ఇ. కృష్ణ మూర్తి పదవి  కోసం ఆత్మ గౌరవం వదలు కోవచ్చు కాని వృత్తి చేసుకునే నాయి బ్రాహ్మణులు ఎందుకు తమ గౌరవం పోగొట్టుకోవాలో నని వారు ప్రశ్నిస్తున్నారు. తమ లాంటి వారు ఓట్లేయటం చేత అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమను దూషించే చంద్రబాబును  ఎందుకు భరించాలి? ఆని వారు ప్రశ్నిస్తున్నారు.


ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రవర్తనలో బాగా మార్పుకనిపిస్తోందని చాలామంది ప్రజలేకాదు స్వంతపార్టీ నేతలే అంటున్నారు. ఇదంతా ఆయన అంతరంగంలో  పెల్లుబుకుతున్న మానసిన ఆందోళన ఫలితమేనని ధృవీకరిస్తున్నారు. తాను ఆలోచించి తాను మాట్లాడింది పూర్తిగా తప్పు అని భయపడి, రాత్రి పొద్దుపోయాక వారితో మళ్ళీ వారితో చర్చలు జరిపి నానా తిప్పలు పడటం మాత్రం ఎవరూ మరచిపోలేరు. అప్పటికే జరగవలసిన ధారుణ నష్టం జరిగి పోయింది.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

అయితే చంద్రబాబు పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న మద్దతు మీడియా ఎంతగా  ఆ కంతను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా అది సొరంగమౌతుంది, కాని పూడి పోవటం లేదు. సరికదా! అది విపక్ష వైసిపి అధినేత జగన్మోహనరెడ్ది చేస్తున్న మహాసంకల్ప యాత్రకు ముఖ్య ముడి పదార్ధంగా మారి – ప్రజల్లో ప్రచారం మాత్రమే కాదు "మౌత్ టూ మౌత్" సమాచారం ద్వారా రచ్చరచ్చ అయిపోయింది. ప్రజలకు చంద్రబాబు అంటే జోకింగ్-స్టాక్ అయిపోతుంది. అలా పుట్టిందే 'అయ్య తుప్పు కొడుకు పప్పు' అనే పంచ్ డైలాగ్. 


మద్దతు మీడియా వేయి నోళ్ళతో ప్రచారం చేస్తే – మౌత్ టూ మౌట్ ద్వారా కోట్ల నోళ్ళలో నాని రభసై పసివాళ్ల నుండి వృద్ధులవరకు తమ కులాన్ని చంద్ర బాబు హీనాతిహీనం చేశారని వారంతా అవమాన భారంతో రగిలి పోతున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణుల ఓట్లు గోవిందా! చంద్రబాబు నోటి దూల తీవ్ర రూపం దాల్చి పెనుభూతమై జనాల్లో బాబు ఇలా ఐపోయాడేమిటి? అంటూ ప్రకంపనలు మొదలయ్యాయి. నాయి బ్రాహ్మణులను మాట అన్న చంద్రబాబు రేపు మిగిలిన బిసి లను అనకుండా ఊర్కుంటారా? అనేది అందరిలో అనుమానం పెనుభూతం అవుతుంది. 


ఇప్పుడు బ్రాహ్మణ సమాజానికి, ఎస్సి ఎస్టి బిసి కాపు దళిత కులాలలో చంద్రబాబు, తెలుగుదేశం పట్ల తీవ్రవ్యతిరేఖత ఉంది. క్రైస్థవ సానుభూతిపరుడు పుట్టా సుధాకర్ యాదవును టిటిడి పాలకమండలి అధ్యక్షుణ్ని చేయటం దానికి రమణ దీక్షితులు వ్యవహారం అగ్నికి ఆజ్యమై హైందవ సమాజయఙ్జానికి తెలుగుదేశం పార్టీ సమిధ అవ్వకుండా ఉంటుందా? దానికి బ్రాహ్మణలు పౌరోహిత్యం చేయకుండా ఉంటారా?
ap-news-telangana-news-people-of-ap-is-being-cheat
ఇప్పుడు చంద్రబాబు కులంలోని సామాన్యులకు సైతం టిడిపిపట్ల నమ్మకం విశ్వాసం సడలుతుంది. టిడిపిని, చంద్రబాబుని నమ్ముకుంటే సమాజం వారిని దూరంపెట్తే ప్రమాధం వారిలో ఇప్పుడు దృఢంగా కనిపిస్తుంది. ఇది జగన్ సంకల్ప యాత్రలో కనిపించింది. 


ఇప్పటికే బిసి వర్గాల తెలుగు ప్రజలు చంద్రబాబు అన్నా,టిడిపి అన్నా మండిపడుతున్నారు. విశాఖలో మత్సకారులను తీవ్రంగా నిందించిన ఘట్టం అలాగే ఉంది.బిసి లాయర్లు జడ్జిలు కాకుండా, వారిపై తప్పుడు అబియోగాలు మోపుతూ చంద్రబాబు రాసిన లేఖ బిసి వర్గాల పుండుపై కారం చల్లినట్లుగా మారింది.


తాజాగా నాయి బ్రాహ్మణులను బీ కేర్ పుల్ అని హెచ్చరించి వారిని దారుణంగా అవమానించ టాన్ని ఆ వర్గాలు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నాయి. ఇక్కడ సమస్య పరిష్కారం అయిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. తమను రక్షించాల్సిన ఒక ముఖ్యమంత్రి – తానే ఇలా బిసి వర్గాలను అవమానించటం  అన్నది ప్రదానం ప్రశ్న గా మారింది. భవిష్యత్తులో ఈయన్ని మరో సారి ముఖ్యమంత్రిని చెస్తే ఇంకేమైనా ఉందా? ఛంద్రబాబు ఆయన కుల ప్రాధాన్యమున్నప్రాంతంలో రాజధాన్ని నిర్మించటం పైనే చాలా అనుమానాలున్న తరుణంలో బాబు కుల వర్గం కాకుండా వేరే కులాల వాళ్లకు ఇక్కడ విలువ ఉండదని అనుకునే సమయంలో బాబు నాయీ బ్రహ్మణులపట్ల ప్రవర్తిన తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

సచివాలయం ఎపుడూ పవిత్రమైనదే. అయితే దాని ఉద్దేశం ప్రజలకు అనుపమాన సేవలందించటం మాత్రమే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు టిడిపి ఎమ్మెల్యే లు, కార్యకర్తలు సచివాలయం లోపలికి చొచ్చుకొని వచ్చి మరీ ధర్నాలు చేసేవారు.


కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన పేషీని ఆక్రమించి నిరసనలు తెలిపారు.  ఎందుకు ఆ ప్రభుత్వం సంయమనం వహించింది? ఇది ప్రజాస్వామ్యం. చొచ్చ్కొనివచ్చిన వారు ప్రజలు కాబట్టే కదా! 


ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయికి ఎవరూ అడ్దురాకూడదని,  రానిచ్చిన వారు ఎవరని? అంటూ హూంకరించిన చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి నేతలు ఎన్నిసార్లు గతంలో ఇతర పార్టీల ముఖ్యమంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం అని మరీచి పోయారా? లేక తనను తానొక సార్వం సహా సార్వభౌముడు అని భావించారా? అని ప్రజలు బహిరంగంగానే చెపుతున్నారు. అదే ఉభయ గోదావరి జిల్లాలలో మహాసంకల్ప యాత్రలో పెల్లుభికిన జనాదరణ ద్వారా ఋజువైంది. దాన్ని టిడిపి మద్దతు మీడియా నిలువరించలేక పోయింది. అరిచేతిని అడ్దుపెట్టి సూర్యకాంటిని ఏవరాపగలరు? అది బాబైనా వారి బాబుమీడియా ఐనా సరే?


విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరనాద్ అనే కార్యకర్త ఆయన కాన్వాయికి  అడ్డుపడే ప్రయత్నం చేసిన ఘట్టాలు ఇప్పటి తరానికి తెలియక పోయినా, ఙ్జప్తికి తెచ్చుకొని వారు ఈ తరానికి చెపుతూనే ఉన్నారు.


ఇక్కడ పాయింట్ ఏమిటంటే “ఇతర ప్రభుత్వాలపై ఎవరైనా నిరసన తెలిపితే అది పోరాటం అని అది హక్కు అని వాదించే చంద్రబాబు” తన ప్రభుత్వానికి తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తే, రోడ్డుపైకి వచ్చినా “ఖబడ్దార్” అంటోంది.


ప్రదాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద కూడా దర్నా చేశామని చంద్రబాబు తన ప్రసంగాలలో గొప్పగా చెబుతారు. కాని తన ఇంటి వద్ద ఎవరు నిరసన తెలిపినా వారి అంతు చూస్తానని అంటు న్నారు. చంద్రబాబుకు, వారి కుటుంబానికి, టిడిపికి మాత్రమే ప్రజాస్వామ్యం కావాలి. వారు మాత్రం నియంతృత్వంగా పాలిస్తారన్నమాట.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

ఆంద్రప్రదేశ్ లో రోజు,రోజుకు చంద్రబాబు ఆయన ప్రభుత్వం ఆయన మంత్రులు టిడిపి ప్రజా ప్రతినిధుల మాటలు కోటలు దాటి ప్రజల గుండెల్లో గునపాలు దింపుతున్నాయి.


తనిప్పుడు గతిలేక యూ-తర్న్ తీసుకొని రాహ్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా కోసం నిరసన ధర్మ పోరాట దీక్షలు ఎవరిపై చేస్తున్నాఓ తెలియకుండా చేస్తున్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నారా? ఫ్రభుత్వం బయట విపక్షంలో ఉండి అలా చేస్తున్నారా? అని సోయి కూడా లేకుండా ప్రవర్తించటం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానించటమే కదా!


కడప ఉక్కు పరిశ్రమ స్థాపన సాధ్యం కాదని 2014లోనే తెగేసి చెప్పిన నరెంద్ర మోడీని 2018లో నిందించటం, దానికై తానా అంటే తందానా అనటానికి అలవాటుపడ్ద ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక చోటా మోటా రాజకీయవాది తరహాలో పచ్చి అవకాస వాదిలా నిరాహార దీక్షలు చేయటాన్ని జనం “సిగ్గులేదా?” అని ప్రశ్నిస్తున్నారు.

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, జనానికి బాబు గతంలో మాట్లడిన పలుకులు చేసిన చేతలు గుర్తుకువస్తున్నాయి. 


*మురికి స్లంస్ నిర్మించటానికే మన ఇంజనీర్లు పనికి వస్తారు కాని అమరావతికి కాదు

*ఏవరు దళితులుగా పుట్టాలని కోరుకుంటారు?

*మేమేసిన రోడ్లపై నడుస్తూ - మేము నిర్మించిన విద్యుత్ వాడుకుంటూ మాకు ఓట్లెందు వేయరు?

*టిటిడి లాంటి హిందూ సంస్థకు మరో మతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని పాలకమండలి అధ్యక్షుని చేయటం

*విజయవాడ అమరావతిలో భూకబ్జాలు చేసి స్త్రీలను లైంగిక దాడులకు గురిచేసిన వారిని అందలం ఎక్కించటం

*పరస్త్రీలను చెరబట్టి అంతమైపోయిన రావణ కంసాదులను గుర్తుకు తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ – విపక్ష శాసన సభ్యులను కొట్టంలోని పశువుల తరహాలో కొని పారెసి – కర్ణాటకలో బిజెపి అదే పని చేయబోతే నిందించిన ఆయనది ఎలాంటి న్యాయం?

*అమరావతి నగరాధిదేవత దేవాలయంలో తాంత్రిక పూజలు నిర్హించటం ఏ పతనానికి దారితీయనుందో ఆయనకు తెలియదా?

*నలభై పైగా దెవాలయాలను తన అమరావతి శాసనసభ్యులతో కూల్చివేసిన పాపం ఊరికే పోతుందా? ఈ పని నాడు హిందూ వ్యతిరేఖి ఔరంగజేబు కూడా చేయలేదట. 


*ఒక మహిళా శాసనసభ్యురాలు నిండు శాసనసభలో ప్రశ్నించిన నేరానికి ఆమెను సభనుండి ఒక సంవత్సరం పాటు గెంటేసిన ప్రభుత్వాధినేతను “ప్రజాస్వామ్య పాలకుదు” అని అనగలమా? ఆయనను గురించి మాట్లాడితే ఆయన ఒక పచ్చి నియంత – 1975 లో భారత్ లో నియంత్రుత్వ ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ పెట్తి స్థాపించిన - ఇందిరా గాంధి తనయుడు సంజయ్ గాంధి అనే యువ కాంగ్రెస్ నేతకు చంద్రబాబు అత్యంత ఆప్తుడు. అంతేకాదు నాడు వారితో ఉండి ఎమర్గెన్సీ ని సమర్ధించిన ప్రధాన అనుచరుడు నాయకుడు నేటి చంద్రబాబు.


*రాష్ట్రంలో మహిళలపై టిడిపి నాయకులే దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసే వారు పాలనార్హత కోల్పోయినట్లేకదా?

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

*అమరావతి పుట్టక ముందే అక్కడ కుల, ప్రాంత ఆర్ధిక అసమానత జాఢ్యం తార స్థాయిని అంటి ఉంది. కుల సామ్రాజ్య స్థాపనకే చంద్రబాబు తన కులాధిపత్య ప్రాంతాన్ని రాజధాని కై ఎంపిక చేసిన వార్తలు ఈ భూమి ఉన్నంతవరకు జనం మరవరు.

*ముక్కరు పంటలు పండే ఆ ప్రాంత మాగాణి భూములు ఇక కాంక్రీటు కీకారణ్యాలై సింగపూర్ కు దారాదత్తం అవనున్నాయి. దీనికి చంద్రబాబు దురాశే కారణం కాదా?

*దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమత్రి తన వేళ్లకు ఉంగరాలు లేవని తన చేతికి వాచీ లేదని పేద అరుపులు అరవటం జనానికి తెలియదా?

*ఆయన ఆదే అబద్ధాలకు అంతు లేదనటానికి జగమెరిగిన ఆయన పలికిన అబద్ధం “ సత్య నాదేళ్ళ” కు ఐయేఎస్ వద్దూ-భవిష్యత్ అంతా ఐటి కాలమే అని చెప్పినట్లు ఆడిన అబద్ధం ఆయన్ని అవమానాల పాలు చేసింది.

*చికాగో స్టేట్ యూనివర్సిటీని గొప్పగా చెపుతూ తనకు అవార్ద్ ప్రధానం చేయబోతూ ఉన్నట్లు చేసిన చేసుకున్న ప్రచారం తో విద్యావంతులు నోళ్ళు వెళ్లబెట్టారు. ఎందుకంటే అదొక వైఫల్య విశ్వ విధాలయం అనేది జగమెరిగిన సత్యం.


*అనేకమంది నేరగాళ్ళు ఆయన మత్రిమండలిలో ఉన్నారు (ఈ దేశం లో ఏ రాష్ట్రంలో లేరు? ఆని బాబ్ ప్రశ్నించవచ్చు) మరి ఆయన నిప్పు కదా? నిప్పుకు తుప్పు అంటదు కదా?

*అవినీతి, అబద్ధాలు, నమ్మక ద్రోహం, నయవంచన, దైవాపచారం, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం, కుల మత వివక్ష, కుటుంబ స్వార్ధం, కాల్మని, లైంగిక దురా చారాలకు, భూకబ్జాలు, కల్తీ, ఎర్ర చందనం, ఇసుక, మైనింగ్ మాఫియా, హిందూ వ్యతిరెఖత మొదలైన వాటి పునాధులపై నిర్మించబడబోయే “అమరావతి “ని విశ్వనగరం అనగలమా?

*సాధారణ మానవుడు ఏమాత్రం దరిచేరలేని, జీవన యోగ్యం కాని ఏ నగరమైనా “విశ్వనగరం” కాగలదా? ఆర్ధిక దోపిడీ అనంతమైన స్వకుల గుత్తేదార్ల నుండి వాటాలు పొందే నాయకత్వం “పోలవరం జాతీయ ప్రోజెక్ట్” నిర్మించగలదా?  


ఇకపోతే బిజెపిని నాలుగేళ్లు పొగిడి పదవులు అనుభవించి ఇప్పుడు పరాభవిస్తుంటే ప్రజలకు ఆ మాటలపట్ల అంత నమ్మకం కలగట్లేదు. అలాగే 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 60 వాగ్ధానాలు నెరవేర్చలేకపోయినా కేంద్రంలోని ప్రభుత్వం తమ వాగ్ధానాలు నేరవేర్చలేదని యాగీ చేయటం ఙ్జానం ఉన్న వ్యక్తి ఎవరూ అంగీకరించరు. అబద్ధాన్ని వందల సార్లు పాలన గాలికి వదిలేసి తన ప్రభుత్వంపై తానే దీక్షలు చేసే నాయకుణ్ణి ఏవరు గౌరవిస్తారు. చంద్రబాబు లాంటి పెద్ద గీత ముందు జగన్మోహనరెడ్డి లోని తప్పులు చిన్న గీతైపోయాయి.   

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat

ap-news-telangana-news-people-of-ap-is-being-cheat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాశీ రస రంగేళి…నృత్యం అదిరిందిగా!!
బాహుబలి ప్రభాస్‌ కు భూ వివాదంలో ఊరట: తెలంగాణా హైకోర్ట్
చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతీ చోటా అభ్యర్ధులు ఓడిపోబోతున్నారట!
గందరగోళం కాదది గుండెలుపిండిన కుంభకోణం
చంద్రబాబు సమీక్షల పట్ల టిడిపి వారి నుండే తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమౌతుంది!
“ఒక్క చాన్స్ ఇచ్చి చూద్ధాం!” అనే జనం - అదే జగన్ గెలుపు!
చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?
పిల్లల భవిష్యత్ తగలడుతుంటే "కింగ్ కేసీఆర్ నీరోలా ఫిడేల్ వాయిస్తున్నారా!”  ప్రజల ఆక్రోశం
వైసీపీ గెలుపు లో జనసేన పాత్ర కీలకం
తెలుగుదేశం ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం అత్యవసరమేనా!
అవకాశాల కోసం ఫ్లడ్-గేట్లు ఎత్తేసి అందాల ఆరేస్తున్నారా! పారేస్తున్నారా!
తెలంగాణా ఇంటర్ బోర్డ్ ఫెయిలైంది - విద్యార్దులు కాదు!
నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు
వివాదాల ఆజంఖాన్‌ పై, వెండితెర అందాల జయప్రద పోటీ
విష సంస్కృతి విష వలయంలో విశాఖ ! ఇక విలయమే
చంద్రబాబు దెబ్బకు పునేఠా ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత రికార్డుల్లో 'రెడ్-మార్క్స్'
మూడో దశ పోలింగ్ లో "బంగారు కోడి పెట్ట"!
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
About the author