2014 ఎన్నికలలో తెలుగుదేశం అదినేత చంద్రబాబు అధికారమే పరమావధిగా ఎంచుకుని రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడిని మహిళలను యువకులను ఇలా అందరినీ మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా విషయంలో అశ్రద్ధ వహించి ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్రంలో దొరికిపోయి దేశవ్యాప్తంగా ఆంధ్రరాష్ట్ర పరువుని తీసేసి తన రాజకీయ లబ్దికోసం ప్రత్యేక హోదా హక్కును కేంద్ర పెద్దల దగ్గర తాకట్టు పెట్టేశారు చంద్రబాబు.
Image may contain: 1 person, crowd and outdoor
మరోపక్క వైసీపీ అధినేత జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ కనుమరుగవుతున్న ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ వైసీపీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించి ఎవరు మర్చిపోకుండా ప్రత్యేక హోదా అంశాన్ని కాపాడారు. ఇదిలావుండగా తాజాగా జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తుంది...జగన్ పాదయాత్ర వల్ల ఇప్పటికే వైసిపి పార్టీకి పొలిటికల్ గా మంచి మైలేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు...దీనికి అనుగుణంగానే వైసీపీ పార్టీ లోకి రోజు రోజుకు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.
Image may contain: 1 person, crowd and outdoor
మాజీ ముఖ్య‌మంత్రి అనుచ‌రుడు ఒక‌రు వైసీపీ పార్టీలోకి చేరుతున్న‌ట్లు స‌మాచారం. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు.
Related image
ఈయ‌న ఇప్ప‌టికే పార్టీ మార‌డానికి రంగం సిద్దం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఇత‌ను చేరిక‌ను వైసీపీ స్వాగ‌తిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విశాఖపట్టణంలో చేరగానే రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ లోకి రావడానికి ఉత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద రాష్ట్రంలో వైసీపీ పార్టీ గ్రాఫ్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వల్ల రోజురోజుకీ పెరుగుతుందనే చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: