కడప జిల్లా వేదికగా ఆంధ్రరాష్ట్రం లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపధ్యంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా ఎన్నికల వేడి పుట్టించేస్తున్నారు. తాజాగా ఇటీవల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలకు దీక్షలకు సిద్ధమయ్యారు. ఈ పరిణామంతో బాబుపై ఒక్కసారిగా వత్తిడి మొదలైంది.
Image result for kadapa steel factory politics
ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులు కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం దీక్షకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీక్షలతో రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో భాగంగానే కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశం పై రాచమల్లు మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ కోసం జిల్లాలోని ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Image result for kadapa steel factory politics
టీడీపీ కి చెందిన ఎంపీ లు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ టీడీపీ కి సవాల్ విసిరారు . రాజీనామా లేఖల్లో ముందు తమ ఎమ్మెల్యే లే సంతకాలు చేస్తామనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు . అయినా వైసీపీ సవాల్ ను టీడీపీ ఎప్పుడు అంగీకరించింది కనుక ఇప్పుడు అంగీకరించడానికి అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Related image
టిడిపి దీక్ష స్థలంలో వేదికపై వచ్చిన నాయకుల ప్రసంగాలు వింటుంటే కడప జిల్లాలో వైసీపీ పార్టీ బురదజల్లడానికి సీఎం రమేష్ దీక్ష చేస్తున్నట్లు ఉంది అని అంటున్నారు రాజకీయ పండితులు...అంతేకాకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబుని కడప జిల్లా కాదు కదా రాష్ట్రంలో ఏ జిల్లా కూడా ప్రస్తుత పరిస్థితిలో నమ్మే అవకాశం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: