చంద్ర బాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరీ మీద వరాల జల్లు కురిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు. కొన్ని రోజుల ముందు నిరుద్యోగ భృతి అని ప్రకటించాడు. కానీ దానిని చాలా మంది విమర్సించారు , దానిని నమ్మే పరిస్థితి లో కూడా ఎవరు లేరు. అయితే బాబు ఇప్పడూ 20,000 ఉద్యోగాలు వదులుతున్నామంటూ నానా హంగామా చేస్తున్నారు. కానీ దీనిని కూడా పూర్తిగా నమ్మలేమని చెప్పవచ్చు. 

Image result for chandra babu

ఓపక్క తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాల ప్రకటనల విషయంలో మాట నిలబెట్టుకోలేకపోయినా ఏపీ కంటే ఎంతో కొంత బెటర్ అనిపించుకుంది. ఇక్కడ మాత్రం అరకొర పోస్ట్ ల భర్తీకి ప్రకటనలు వేయడం, అందులోనూ భర్తీ ప్రక్రియను ఆలస్యం చేయడం, పంచాయతీ సెక్రటరీ వంటి పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తామని చెప్పడం.. ఇలాంటి రకరకాల కారణాలతో టీడీపీ తన ప్రతిష్టను పూర్తిగా దిగజార్చుకుంది. 

Image result for chandra babu

తాజాగా తెలుగు తమ్ముళ్లు, టీడీపీ క్యాడర్ చేస్తున్న ఉద్యోగాల భర్తీ అనే ప్రచారం కూడా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలయ్యే సమయానికి తమకు సంబంధం లేదన్నట్టు చేతులెత్తేసేలా కార్యాచరణకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. గతంలో టీచర్ పోస్టుల భర్తీలో ఇలానే వ్యవహరించింది టీడీపీ సర్కార్. ఐదేళ్లకు కానీ వాళ్లకు అపాయింట్ మెంట్స్ ఇవ్వలేదు. వాళ్లలో కొంతమంది ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారంటే, ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: