ఎన్నిక‌లు  ముంచుకొస్తున్న నేప‌ధ్యంలో చంద్ర‌బాబునాయుడు స‌రికొత్త డ్రామాకు తెర‌లేపుతున్నారు. నాలుగేళ్ళ‌పాటు ఏమీ మాట్లాడ‌కుండా కూర్చున్న చంద్ర‌బాబు హ‌డావుడిగా డ్రామా మొద‌లుపెట్ట‌టం ఆశ్చ‌ర్యం ఉంది. ఇంత‌కీ ఆ డ్రామా ఏమిటంటే త్వ‌ర‌లో 20 వేల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని తెలుగుదేశంపార్టీ నేత‌ల‌తో జ‌రిగిన స‌మ‌న్వ‌య కమిటి స‌మావేశంలో చెప్ప‌టం. అదే విష‌యాన్ని జ‌నాల్లో ప్ర‌చారం చేయాల‌ట‌.  పోయిన ఎన్నిక‌ల్లో ఇంటికో ఉద్యోగ‌మిస్తాన‌ని లేక‌పోతే  నిరుద్యోగ భృతి ఇస్తాన‌న్న‌ది చంద్ర‌బాబు ఇచ్చిన‌ ప్ర‌ధాన హామీల్లో ఒక‌టి.


ఉద్యోగ‌మూ లేదు..నిరుద్యోగ భృతీ లేదు

Image result for chandrababu manifesto on unemployment 2014

ఎప్పుడైతే అధికారంలోకి వ‌చ్చేరో వెంట‌నే త‌న హామీని ప‌క్క‌న పెట్టేశారు. ఈ నాలుగేళ్ళ‌ల్లో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌మ‌ని నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నా ప‌ట్టించుకోలేదు.  పోనీ నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. ఇటువంటి ప‌రిస్దితుల్లో చంద్ర‌బాబుపై రాష్ట్రంలోని నిరుద్యోగులంతా మండిపోతున్నారు. ఏదో ఐటి కంపెనీలు తెచ్చామ‌ని, ల‌క్ష‌లాది మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని అప్పుడ‌ప్పుడు నారా లోకేష్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు  జ‌నాల్లో పెద్ద‌గా న‌మ్మ‌కం క‌లిగించ‌టం లేదు. 


ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌ర్తి జ‌ర‌గాలి

Image result for unemployment in ap

ఇటువంటి ప‌రిస్దితుల్లో మ‌ళ్ళీ ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి. భ‌ర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ల‌క్ష‌ల్లో ఉన్నాయి. నిరుద్యోగ భృతి అందుకోవాల్సిన వాళ్ళే సుమారు 10 ల‌క్ష‌ల‌మందున్నారు. వాళ్ళ‌ల్లో పేరుకుపోతున్న ఆగ్ర‌హాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీ అనే డ్రామాకు తెర‌లేపారు. నిజంగా చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌గ‌ల‌రా ? అంటే అనుమాన‌మే. 


డిసెంబ‌ర్ లోనే ఎన్నిక‌లా ?

Related image

ఎందుకంటే, ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు అని చంద్ర‌బాబు చెప్పినా కార్య‌రూపం దాల్చటానికి ఎంత కాలం ప‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ముందు భ‌ర్తీ చేయాల్సిన ఉద్యోగాల‌ను గుర్తించాలి. త‌ర్వాత ప్ర‌భుత్వం  నోటిఫికేష‌న్లు ఇవ్వాలి.  అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.  రాత ప‌రీక్ష‌లు జ‌రిగిన త‌ర్వాత ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గాలి. ఈ మ‌ధ్య‌లో ఎవ‌రు కూడా ఏ విష‌యంలోనూ కోర్టుకు ఎక్క‌కూడ‌దు. ఎందుకంటే, ఇష్టంలేని ప‌ని చేయాలంటే ప్ర‌భుత్వాలే లొసుగుల‌తో నోటిఫికేష‌న్లు ఇస్తోంది. దానిమీద ఎవ‌రో ఒక‌రు కోర్టుకు వెళ్ళ‌గానే  కోర్టు నోటిఫికేష‌న్ల‌ను ఆడ్డుకుంటోంది. దాంతో భ‌ర్తీ ప్ర‌క్రియ మొత్తం ఆగిపోతోంది. దాంతో  కోర్టు ఆదేశాల కార‌ణంగా భ‌ర్తీ ప్ర‌క్రియ‌ నిలిపేస్తున్న‌ట్లు  ప్ర‌భుత్వం చెప్పుకుంటోంది.  బ‌హుశా చంద్ర‌బాబు మ‌న‌సులో కూడా ఇటువంటి ఆలోచ‌నే ఉండుంటుంది. 


వేల ఉద్యోగాల భర్తీ జ‌రిగే ప‌నేనా ?

Related image

ఈ ఏడాది చివ‌ర‌లోనే  ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  అదే నిజ‌మైతే ఎన్నిక‌ల‌కు మిగిలింది కేవ‌లం ఆరుమాసాలు మాత్ర‌మే. ఈ ఆరుమాసాల్లో 20 వేల‌ ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగే ప‌నికాదు. అంటే ఉద్యోగాల భ‌ర్తీ అనే ప్ర‌చారంతో  కాలం గ‌డిపేయాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. మ‌రి చంద్ర‌బాబుది డ్రామాకాక మ‌రేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: