దేశంలో ఈ మద్య మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు అంటూ వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.  తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదు ఇవ్వడానికి పోలీసుల వద్దకు వస్తే..కొంత మంది పోలీసులు కామంధులు కావడంతో తమ గోడు ఎక్కడ విన్నివంచుకోవాలని బాధపడుతున్న మహిళలు ఎంతో మంది ఎన్నారు. 
Image result for bjp mla nilima abhai mishra
రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు అక్రమాలకు పాల్పడితే..బాధితులనే బాధపెడితే ఆ పరిస్థితి ఎలా ఉంటూందో ఊహించుకోగలం.  అయితే ఈ మద్య సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు, మహిళా నేతలకు కూడా ఇలాంటి దుస్తితి ఏర్పడింది. తాజాగా తమ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత ప్రోద్బలంతో తన కుటుంబ సభ్యులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మధ్యప్రదేశ్‌ శాసనసభలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే నీలిమా అభయ్‌ మిశ్రా కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే దీనిపై స్పందించిన స్పీకర్‌ హోం మంత్రిని వివరణ కోరారు.
Related image
ఆమె ఆవేదనపై ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్‌ మిశ్రా స్పందిస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఆమెకు అండగా నిలచిన విపక్ష నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేకే భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని విమర్శలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. సభలోనే కన్నీరు మున్నీరైన ఆమెను కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓదార్చారు. రివా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నీలిమ.. సిమరియా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: