వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి నేటితో 200 రోజులు పూర్తయ్యింది. జగన్ సంకల్పం నిజంగా మెచ్చుకోదగ్గదే. తన తండ్రి అనుసరించి బాటనే జగన్ ఎంచుకున్నాడని చెప్పాలి. ప్రజల్లోకి వెళ్ళటం అనే పంథాని ముందుగా రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టాడు. దాన్ని ఆయన వారసులిద్దరూ అనుసరించారు. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ... ప్రభుత్వ ఫలాలు అందని బాధితులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. 
లెక్కేసుకోడాల్లేవ్.... 


రోజుల లెక్కలు కాదు. కిలోమీటర్ల కొలతలు కాదు. అభిమానాల తూకం కాదు. ప్రజా సంకల్పం యాత్ర జనజాతరని తలపిస్తుంది. పోటెత్తుతున్న ప్రజాభిమానానికి నిలువెత్తు నిదర్శనమే జగన్ ప్రజాసంకల్ప యాత్ర. కళ్లు చించుకున్నా, కళ్లలో నిప్పులు పోసుకున్నా కోటి సూర్యప్రకాశంలాంటి ఆ ప్రభను ఆపలేకపోయారు. సర్వేలు, రిపోర్టులంటూ టిడిపి వేసుకున్నట్టు లెక్కేసుకోడాల్లేవ్… జన హోరు జగన్ జోరు ఆగకుండా సాగిపోతూనే ఉంది. నేటితో 2500కిలోమీటర్లకు చేరువై, 200 రోజులను పూర్తి చేసకున్న ప్రజా సంకల యాత్ర ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన మహా ప్రస్థానాన్ని మరోమారు గుర్తు చేసింది. జన ప్రభంజనమై, జగన్నినాదమై సాగుతున్న వేళ జగన్ వేస్తున్న అడుగులు ప్రజల గుండెల్లో ఒక గుర్తుగా నిలుస్తున్నాయనటంలో ఏ సందేహం లేదు.


ప్రజా సంకల్ప యాత్ర సాగిన తీరు...


నవంబర్ 6, 2017 వైయస్ఆర్  జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రజా సంకల్పానికి తొలి అడుగు పడింది. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్వేగపూరిత వాతావరణంలో, జగన్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. అడుగులో అడుగేస్తూ అశేష జనవాహిని మద్దతుతో నేటికీ 200 రోజులు తన  పూర్తి చేసుకున్నారు జగన్. 1243 గ్రామాలను, 158 మండలాలను, 92 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తూ 86 జనసభల్లో ప్రసంగించి జగన్ ప్రజల్లో ఉంటూ ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానానికి తెర తీశారు. ప్రజా సంకల్ప యాత్ర లో జగన్ అడుగు తీసి అడుగేసిన కానీ అనంతసాగరమల్లే అశేష జనవాహిని కనిపిస్తున్నారు. ఏ సభ పెట్టినా జన ప్రభంజనం పోటెత్తుతుంది. కానీ ఈ వచ్చిన జనమంతా జగన్ ఏ విధంగా ఓట్ల రూపంలో మలచుకుంటాడన్నదే ప్రశ్న. ఎందుకంటే అధికార పార్టీకి ఈ పాదయత్రకి వస్తున్న స్పందన చూసి వెన్నులో వణుకు పుడుతున్న మాట కాదనలేని వాస్తవం. కానీ ఒక సీనియర్ నాయకుడు అన్నట్లు జగన్ కి జనం మద్దతు ఉంది కానీ ఎన్నికల మేనేజ్ మెంట్ టీం లేదన్నట్లు ఈ ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో వైఎస్సార్సీపీ ఎలా మలచుకోగలదో రానున్న రోజుల్లో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: