ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అనూహ్య మ‌ద్ద‌తు ల‌భించింది. త‌మిళ‌నాడు విప‌క్ష నాయ‌కురాలు.. మాజీ సీఎం క‌రుణానిధి కుమార్తె బాబును ఆకాశానికి ఎత్తేసింది.  కడపలో జరుగుతున్న ఉక్కుదీక్షలకు సంఘీభావం తెలిపేందుకు స్వయంగా కడపకు విచ్చేసి దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌, బీటెక్‌ రవిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.   ఆంధ్ర, తమిళనాడు ప్రజలు తల్లీబిడ్డల్లా కలిసి ఉంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగానే ఎదుర్కొంటామన్నారు. ఉక్కు పరిశమ్ర సాధన కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌, బీటెక్‌ రవికి మద్దతు ఇచ్చేందుకు విచ్చేశామన్నారు. 
తమ పార్టీ అధినేత కరుణానిధి, సోదరుడు స్టాలిన్‌ ఈ దీక్షలకు సంఘీభావం తెలపాల ని తనను పంపారన్నారు. 


అంతేకాదు,  తమిళనాడు ప్రజలు మొదటి నుంచి కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్నారని, బీజేపీ జాతీయ వ్యతిరేక విధానాలే కారణమన్నారు. ఇటీవల చెన్నైలో ఓ పరిశమ్ర కాలుష్యం వెదజల్లుతుందని ఆందోళన చేస్తే 30 మందిని కాల్చి పొట్టనబెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నామని, ఇప్పటికి ఏడు రోజులుగా ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తున్నా ప్రధాని మోడీ పట్టించుకోలేదని, వారి కుటుంబ సభ్యులను చూస్తే ఎంతో ఆందోళనగా కనిపిస్తున్నారన్నారు. 


ఏపీ సీఎం చంద్రబాబు నిజంగా లీడరేనని, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారని ఆమె ప్రశంసించారు. కనిమొళి ప్రసంగం మొదలైన నుంచి ముగింపు వరకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అయితే, క‌నిమొళి రాజ‌కీయం అక్క‌డితో ఆగిపోలేదు. ఆమెకు ఇప్పుడు త‌మిళ‌నాడులో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోం ది. ఎర్ర‌చంద‌నం దుంగ‌ల దొంగ‌ల పేరుతో 35 మందిని ఏపీపోలీసులు 2015లో పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు కాల్చి పారేసిన‌ప్పు డు ఇదే క‌నిమొళి.. చంద్ర‌బాబును రాక్ష‌సుడితో పోల్చింది. ఇక‌, తెలుగు గంగ నీటిని విడుద‌ల చేయ‌లేద‌ని, త‌మిళ నాడు రైతులు గ‌డ్డి తింటున్నార‌ని పేర్కొంటూ. బాబును రైతు వ్య‌తిరేక‌గా చిత్రీక‌రించిందికూడా క‌నిమొళి అమ్మే! 


అయితే, అనూహ్యంగా ఆమె టంగ్ మార్చ‌డానికి కార‌ణం.. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌నేన‌ని తెలుస్తోంది. అంతేకాదు, డీఎంకే పార్టీకాంగ్రెస్‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో క‌లిసి పోరాటం చేసేందుకు ఇప్ప‌టికే వీరు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో క‌నిమొళి.. రాక కేవ‌లం.. బాబును బుట్ట‌లో వేసుకునేందుకు, రాజ‌కీయంగా కాంగ్రెస్ ఆడిస్తున్న నాట‌క‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఎప్పుడు ఎలా మార‌తారో?  ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో? అనేందుకు ఇది ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణగా మిగిలిపోనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: