రాజ‌కీయంగా చైత‌న్యం క‌లిగిన ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ వ‌ర్గ పోరు.. ఆ పార్టీని తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. అభివృద్ధి ప‌రంగా అత్యంత వెనుక బ‌డిన ఈ జిల్లా.. రాజ‌కీయంగా మాత్రం చైతన్యంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఇక్క‌డ నుంచి గెలుపొందిన నేత‌ల‌పై ప్ర‌జ‌లు ఎప్పుడూ చ‌ర్చించుకుంటారు. ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధి విష‌యంలో ఎవ‌రి పాత్ర ఎంత? అని కూడా చ‌ర్చించుకుంటారు. ఇక‌, ఇక్క‌డ రాజ‌కీయంగా కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే, అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో వీరు ప్ర‌ద‌ర్శించిన ధోర‌ణుల‌తో విసుగుచెందిన ఇక్క‌డి ప్ర‌జ‌లు వారిని ప‌క్క‌న పెట్టారు. ఇలా ప్ర‌జ‌ల రాజ‌కీయ చైత‌న్యం జిల్లాలో కీల‌కంగా మారింది. ఇక‌, ఇక్క‌డ టీడీపీ నేత‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 

Image result for chandrababu naidu

ఎవ‌రికివారు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుని అమ‌లు చేసుకుంటున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌ల జోరు పెరిగింది. విష‌యంలోకి వెళ్తే.. తెలుగు దేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉంటు న్న సీనియర్‌ నేతలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్లు ఇవ్వ‌క‌పోతే... పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావిస్తున్న ట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్‌ నాయకుడు క‌రణం బలరామకృష్ణమూర్తి తాజాగా సంచ లనం సృష్టిస్తున్నారు. తన కుమారుడికి అద్దంకి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే...పార్టీ నుంచి వెళ్లిపోతామని తన సన్నిహితులకు తెలిపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.  గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్‌ చేతిలో కరణం కుమారుడు ఓడిపోయారు. 

Image result for tdp

తరువాత గొట్టిపాటి టీడీపీలోకి రావడంతో..అప్పటి నుంచి ఈ ఇద్దరికీ పొసగడం లేదు. వాస్త‌వానికి గొట్టిపాటి పార్టీలోకి రావడాన్ని కరణం సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమకు అద్దంకి సీటు ఇవ్వకపోతే ... వైసీపీలోకి వెళతామని చెబుతున్నారట. క‌ర‌ణంకు ఇప్ప‌టికే వైసీపీ నుంచి భారీగా ఆఫ‌ర్లు ఉన్నా పార్టీలోనే కొంత‌మంది ఒత్తిడి చేస్తుండ‌డంతో ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది.


ఇదే బాట‌లో మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా వ్య‌వ‌హ‌రి స్తుండ‌డం ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  కొండపి ఎమ్మెల్యే బాలాంజనేయస్వామి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇప్పటికే కొండపి ఎమ్మెల్యే తాను పార్టీని వీడేది లేదని ప్రకటించి ఆయ‌న‌పై జ‌రుగుతోన్న ప్ర‌చారానికి తెర‌దించారు. మ‌రి పోతుల రామారావు, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఈ విష‌యంలో ఏం చేస్తారో ?  చూడాలి. ఆమంచి కూడా పార్టీలో అంత సంతృప్తిగా లేర‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నిక‌ల వేళ ప్ర‌కాశం టీడీపీలో కుంప‌ట్ల‌ను బాబు ఎలా సెటిల్ చేస్తారో ?  మాత్రం స‌స్పెన్సే.


మరింత సమాచారం తెలుసుకోండి: