తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కుటుంబ సమేతంగా విజయవాడకు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు.  కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. త్యేక రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి ముక్కు పుడక చేయిస్తానని గతంలో మొక్కుకున్న సీఎం.. ఇప్పుడు దాన్ని చెల్లించుకోబోతున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెజవాడకు చేరుకున్నారు. 

ఇప్పటికే తిరుమల శ్రీవారికి సాలిగ్రామహారం, కంఠాభరణం.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం.. కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. ఇప్పుడు దుర్గమ్మ మొక్కు చెల్లించుకోబోతున్నారు.  దుర్గ గుడిలో కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక భద్రత, ప్రొటోకాల్ సిబ్బంది ఉదయాన్నే గుడికి చేరుకున్నారు. 


కేసీఆర్ షెడ్యూల్ వివరాలు ఇవే!
మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రభుత్వ వెటర్నరీ కళాశాల గెస్ట్ హౌస్ కు బయల్దేరుతారు. పది నిమిషాల పాటు అక్కడ సేద తీరుతారు. అనంతరం దుర్గ గుడికి వెళతారు. 40 నిమిషాల పాటు గుడిలో ఉంటారు. పూజలు, మొక్కులు చెల్లించుకున్న అనంతరం గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. పది నిమిషాల విశ్రాంతి అనంతరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. 2.20 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: