జనసేనలోకి మాజీలూ, తాజాలూ క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేద్దామని  ఉరకలేస్తున్న కొత్త వారు సైతం జనసేనని టచ్ లోకి వస్తున్నారు. విశాఖలో మూడు రోజుల పాటు విడిది చేసిన పవన్ కళ్యాణ్ ను ఇలా అనేకమంది కలిసి అప్లికేషన్ పెట్టుకున్నారు.


చింత తీరుతుందా
ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగ్రెట్రం చేసి 2009న అనూహ్యంగా ఎమ్మెల్యే అయిపోయిన చింతలపూడి వెంకట రామయ్య ఇపుడు మళ్ళీ పోటీకి రెడీ అంటున్నారు. మధ్యలో కాంగ్రెస్, టీడీపీలతో కలసి నడచినా అక్కడ టిక్కెట్ దక్కే చాన్స్ లేకపోవడంతో ఈ మాజీ గారు చూపు జనసేనపైన పడింది. విశాఖలో ఓ గెస్ట్ హౌస్ లో బస చేసిన పవన్ని కలసి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో 29న ముహూర్తం పెట్టేసుకున్నారని టాక్.


మరో మాజీ సిధ్ధం

పెందుర్తి నుంచి ఓ విడత కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గండి బాబ్జీ కూడా పవన్ని కలిశారు. అయన సైతం చాన్స్ ఇస్తే తయార్ అంటున్నారు. బాబ్జీ కాంగ్రెస్, వైసీప్, టీడీపీ లలో పని చేశారు. తనకంటూ కొంత క్యాడర్ వున్న బాబ్జీ ఈ దఫా జనసేన ద్వారా అసెంబ్లీ మెట్లెక్కాలనుకుంటున్నారు. మరి పవన్ కరుణిస్తారో లేదో. 


టీడీపీ మాజీ అధ్యక్షుడు కూడా

తెలుగుదేశం అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోన తాతారావు పవన్ని కలసి టిక్కెట్ కోసం అభ్యర్ధించారు. ఆయన గాజువాక నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ఆ సీటుకు చింతలపూడితో పోటీ వస్తోంది. మరి పవన్ ఎవరికి హామీ ఇస్తారో చూడాలి.


కొత్త వారు సైతం

పెందుర్తికి చెందిన రియల్టర్ మండవ రవికుమార్ జనసేనలో చేరుతున్నారు. పెందుర్తి సహా ఎక్కడ నుంచి టిక్కెట్ ఇచ్చినా పోటీకి సిధ్ధమని చెబుతున్నారు. వీరే కాకుండా పలువురు తటస్తులు, పారిశ్రామికవేత్తలు పవన్ పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: