జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తరచూ అంటున్న మాట వెనకబాటుతనంతో ఉత్తరాంధ్ర కూడా విడిపోతుందని. ఈ మాట యువతలో ఎంతటి ప్రభావం కలిగిస్తొందో ఆయన కనీసమాత్రం  కూడా వూహించలేకపొతున్నారు. పైగా తెలంగాణా విడిపోయినపుడు తాను ఎంతో కలత చెందానని, భోజనం కూడా మానేసానని చెప్పుకున్న పవన్ నోటి వెంట ఈ విడిపోవడం మాటలేంటి అంటూ జనం విస్తుబోతున్నారు. అభివ్రుధ్ధి జరగక పోతే విడిపోవడం ఒక్కటే మార్గమా. అల ఐతే ఈ రాష్ట్రం మరెన్ని ముక్కలు కావాలంటూ మేధావులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. తాజాగా విశాఖ టూర్ లోనూ పవన్ ఉత్తరాంధ్ర విడిపోటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Image result for jenasena

నిజానికి ఇక్కడ జిల్లాలు బాగా చితికిపోయినవి అన్న దాంట్లో ఎంతో నిజం వుంది. పాలకులు పట్టించుకోవడం లేదు అన్న విషయమూ వాస్తవమే. కానీ ఇదే కారణంతో ఈ ప్రాంతం విడిపోతుందని చెప్పడమే దారుణం. పవన్ వంటి జనంలో గ్లామర్ వున్న లీడర్ ఇలాంటి కామెంట్స్ పదే పదే చేయడం వల్ల జనంలో కొత్త అలోచనలు పుట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అది విపత్కర ధోరణులకూ దారి తీసే ప్రమాదం వుంది.

Image result for jenasena

అత్యంత దయనీయమైన స్థితి

శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాలను ఒక్కసారి చూస్తే చాలు, మొత్తం వెనకబాటుతనం అంతా అక్కడే కనబడుతుంది. కలెక్టర్ ఆఫీసులు కూడా సరిగా వుందని దుస్థితి. రోడ్లు దుర్బరం, పారిశుధ్ధ్యం అత్యంత హీనం,  ఎటు చూసిన పందులు, ఇతర జంతు జాలం ఏకంగా రోడ్డు మీదకే వచ్చేసే పరిస్థితి. ఇంక జిల్లాలలోని ఇతర ప్రాంతాల సంగతి చెప్పనవసరం లేదు. బీదరికం, నిరక్షరాస్యత గత డెబ్బై ఏళ్ళుగా ఎంతో చేసామని అంటున్నా ఎక్కడా కనిపించని అభివ్రుధ్ధి ఫలాలు ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి నిదర్శనాలు.


అన్ని జబ్బులకూ నిలయం 


శ్రీకాకుళం చూసుకుంటే ఉద్దనాం కిడ్నీ రోగులకు ప్రసిధ్ధిగాంచింది. విజయనగరం దోమలతో నిండిపోయి అనేక్  డెంగ్యూ వంటి విష జ్వరాలకు నిలయమైంది. విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ సహా అనేక జబ్బులతో జనం చస్తున్నారు. నేటికీ సరైన వైద్యం అక్కడ అందదు. ఇక ఉపాధి కోసం వలస పట్టిన వారిలో అధికులు ఈ జిల్లలవారే అని గణాకాలు వెల్లడిస్తున్నాయి. అయినా ఇక్కడ జనం అన్నీ సహించి తమ బతుకులేవో బతికేస్తున్నారు.

Related image

జనం వలస పోతారు.. వలస నాయకులు పాలిస్తారు

ఈ జిల్లాల తీరు భలే చిత్రంగా వుంటుంది. ఇక్కడ జనం పొట్ట చేతబట్టుకుని వలస పోతారు. నాయకులు ఇక్కడికి వలస వచ్చి రాజకీయం చేస్తారు. ఐతే ఈ జిల్లాల ప్రజనీకంలో గొప్పతనం కలసి వుండే స్వభావం. ఎంతటి కష్టాన్నైనా భరించే గుణం. అందరినీ నమ్మి ఆదరించే తత్వం. అందుకే ఇతర ప్రాంతవాసులు ఈ జిల్లాలకు వలస వచ్చి పోటీ చేసి గొప్ప పదవులు పొందితే జనం తమ పొట్ట నింపుకోవడానికి వేరే  చోటుకు వలస పోతున్నారు. ఇంతటి మంచి స్వభావం వేరే ఎక్కడైనా వుంటుందా. ఎంతో శాంతి  కాముకులైన ప్రజలు ఇక్కడ కనిపిస్తారు.


అపరిపక్వతతోనే కామెంట్స్

పవన్ రాజకీయ అపరిపక్వతతోనే వేర్పాటువాదంపై కామెంట్స్ చేస్తున్నారని మేధావులు అంటున్నారు. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన పవన్ నుంచి జనం ఎంతో ఆశిస్తున్నారు, అయన సైతం ఏదో చేద్దామనుకునే వచ్చారు. అటువంటపుడు పాలకులపై విమర్శలు సంధించినా ఉత్తరాంధ్ర జిల్లాలు వేరు పడతాయంటూ పెద్దపెద్ద మాటలు వాడడం మాత్రం తగదని సూచిస్తున్నారు. మూడు జిల్లల ఉత్తరాంధ్ర వేరు పడి ఏం చేస్తుందన్న స్ప్రుహతో పవన్ అలోచిస్తే బెటర్ అంటున్నారు. పవన్ తన పార్టీ ద్వారా ఈ ప్రాంత అభివ్రుధ్ధికి ప్రణాళిక అందించి ఇతర పార్టీలకు కను విప్పు కలిగించాలని కూడా సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: