తనను నిర్లక్ష్యం చేసినందుకు ఓ తెలుగు తమ్ముడు అధినేత చంద్రబాబుకు గట్టి  షాక్ ఇచ్చారు. సరిగ్గా బాబు ఉత్తరాంధ్ర టూర్లో ఉన్న టైంనే చూసుకుని మరీ జనసేనలో చేరిపోయారు. ఆ విధంగా బాబుకు ఝలక్ తగిలింది. టీడీపీ విశాఖ అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోన తాతారావు పవన్ చేతిలో చెయ్యేసి మరీ కండువా కప్పేసుకున్నారు. టీడీపీ మునిగే పడవని చెప్పకనే చెప్పేశారు.


ఎదురు దెబ్బేనా


యాదవ సామజిక వర్గానికి చెందిన తాతారావుకు గత ఎన్నికలలో టిక్కెట్ ఇస్తానని నమ్మించి మరీ టిక్కేట్టేయడమే కాకుండా, ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చినందుకు ఇలా జంప్ తో కౌంటర్ ఇచ్చారన్న మాట. దాంతో ఆ సామాజికవర్గంలోనూ టీడీపీపై సెగ రగిల్చేశారు. ఓ వైపు శ్రీకాకుళంలో ఏరువాకను ప్రారంభించిన బాబు టీడీపీకి తిరుగులేదు, ఎదురులేదు అని చెబుతున్న టైం లోనే  ఇలా ఎదురుదెబ్బ పడిపోయింది.


మరిన్ని జంపింగులు ష్యూర్

ఎంత సేపు అధినేత కొట్టే షాట్లే కాదు, మేము వేసే బౌన్సర్లూ ఎలా ఉంటాయో చూడమంటూ కోన తాతారావు కాసింత టేస్ట్ చూపించాడు. మరి ఇదే బాటలో మరి కొంత మంది అసంత్రుప్త తమ్ముళ్ళు కూడా నడిస్తే విశాఖ టీడీపీకి ఇక కొంప కొల్లేరూ, గుండె   బేజారేనంటున్నారు. ఇక‌ పవన్ మాత్రం విశాఖలోనే సిట్టింగ్ వేసి మరీ టీడీపీకి గేలం వేసెస్తున్నారని టాక్. ఎన్ని చేపలు పడతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: