ప్రముఖ ఆర్థిక గణాంక నిపుణుడు, రెండో పంచవర్ష ప్రణాళిక నమూనా రూపకర్త పీసీ మహలనోబిస్‌ జయంతిని ' జాతీయ గణాంక దినోత్సవం'గా నిర్వహిస్తారు. జూన్ 29 న మహలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం రూ.125 నాణెం, కొత్త రూ.5 నాణేలను కేంద్రం విడుదల చేయనుంది. జాతీయ స్థాయిలో ఏటా జూన్‌ 29ను గణాంక దినంగా జరుపుకోవాలని 2007లో ప్రభుత్వం నిర్ణయించింది. సాంఘిక- ఆర్థిక ప్రణాళికలు, విధానల రూపకల్పనలో గణాంకాల ప్రాధాన్యత, మహలనోబిస్‌ చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం. 
Image result for pc mahalanobis
 ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీటిని శుక్రవారం విడుదల చేయనున్నారు. సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో గణాంకాల ప్రాధాన్యతను దేశ ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సారి మహాలనోబిస్‌ జయంతి వేడుకని కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహస్తున్నాయి. 

రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నమూనా మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధిగాంచింది. 1955 నుంచి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ తన సేవలందించారు.  1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌‌ను ప్రారంభించిన మహలనోబిస్, దీన్ని స్వయంప్రతిపత్తి సంస్థగా ప్రకటించారు.
రేపు కొత్త రూ.125, 5 నాణేలని విడుదల చేయనున్న వెంకయ్య..
అయితే దేశ ప్రాముఖ్యత దృష్ట్యా 1959లో దీనిని జాతీయ సంస్థగా కేంద్రం ప్రకటించింది. అయితే రేపు కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఎన్‌స్టిట్యూట్‌, స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖల సంయుక్తంగా మహాలనోబిస్ జయంతి వేడుకని జరపనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: