ఏపి రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు.  ముఖ్యంగా ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం జేసీ బ్రదర్స్ అప్పట్లో కాంగ్రెస్ లో హడల్ ఉండేది.  ప్రస్తుతం టీడీపీలో ఎంపీగా కొనసాగుతున్న జేసీ తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.   కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఓ ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కదా.   సీఎం రమేశ్ దీక్షకు మద్దతు పలికినట్టే పలికి టీడీపీకి పెద్ద దెబ్బ కొట్టేశారు.
Image result for cm ramesh protest
సీఎం రమేశ్ ఎన్ని దీక్షలు చేసినా కడప ఉక్కు ఫ్యాక్టరీ రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ... ‘ఉక్కు రాదు తుక్కు రాదు’ అంటూ తనదైన శైలి కామెంట్లు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కూడా రాదని ఎంపీ జోస్యం చెప్పారు. పప్పు బెల్లాలు చిలకరిస్తారు.. ఇవన్నీ కూడా వాస్తవాలని జేసీ పేర్కొన్నారు. ఈ విషయం నిరసన చేసే సీఎం రమేష్‌కు తెలుసు, నాకు తెలుసని చెప్పారు. 
Image result for cm ramesh protest
ప్రస్తుతం మూడువేల ఎకరాలు అందుబాటులో ఉంది. మెకాన్ 18వందల ఎకరాలు కావాలని అని అడిగింది. ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాల ప్రైవేట్ భూమి కావాలంటున్నారు. ఎకరానికి రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పాం.  16కి.మీ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాం. మేము విజయం సాధించలేదు.  ఇంకో.. 24గంటల్లో అవసరమైన సమాచారం ఇస్తామని  ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: