ముందస్తు ఎన్నికల గురించి మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు వస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లేది లేదని అన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన బిజెపి పార్టీ ఆంధ్రలో పట్టు కోల్పోయిందని అలాగే ఆంధ్రా నమ్మకం కూడా పోగొట్టుకుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అయిదు సంవత్సరాలు పాలన చేస్తుందని అన్నారు. దేశంలో వేరే రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేదన్నారు.
Related image
ఆంధ్రరాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనేలా పార్టీ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నామని లోకేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఇటీవల మీడియాతో మాట్లాడిన లో "గడిచిన నాలుగేళ్లలో దాదాపు 20,382 కోట్లు విలువైన పనులు ప్రారంభించండం జరిగింది. అందులో దాదాపు 16వేల కోట్ల రూపాయిల పనులు పూర్తి చేశాము. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఇన్ని పనులు ఏ రాష్ట్రంలోనూ జరగనేలేదు.
Image result for chandrababu lokesh
ఒకే ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. రాబోయే ఒక్క సంవత్సరంలో ఇంకో 20వేల కోట్ల రూపాయిలు ప్రారంభించబోతున్నాము. ఈ ఐదు సంవత్సరాలు 40 వేల కోట్లు పనులు చేయడం ఇదో చరిత్ర.. ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నాము. రోడ్ల విషయంలోనూ సీఎం చంద్రబాబు మాకు నిర్ణయాలు ఇవ్వడం జరిగింది. 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయితీలన్నింటికి లింక్ రోడ్లు వేయమన్నారు. త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తాము" అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
Image result for chandrababu lokesh
అయితే ఇదంతా విన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు నారా లోకేష్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని అన్నారు...లోకేష్ అబద్ధాలు చెప్పడంలో తండ్రికి తగ్గ కుమారుడని పేర్కొన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబు అబద్ధపు హామీలు చేపి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ అవినీతిమయం చేస్తే..లోకేష్ మాత్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: