జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్ర సమస్యలనీ రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇలా మాట్లాడటం వల్లన ప్రజా ఉద్యమాలు పుట్టే అవకాశం ఉంది. ప్రతి సారి ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమ స్ఫూర్తి కలవారని, వారి ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం తో పోల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతక ముందు ఉద్దానం భాదితుల గురించి కొంచెం శ్రద్ద పెట్టి పోరాడినాడని చెప్పవచ్చు. 

Image result for janasena pawan kalyan

అలాగే, ఓ విదేశీ యూనివర్సిటీకి చెందిన వైద్య బృందాన్ని పవన్‌, ఉద్దానంకు రప్పించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పవన్‌కళ్యాణ్‌ సూచనలకి కొంత 'విలువ' ఇచ్చినట్లే కన్పించింది. అలా ఉద్దానం సమస్య పరిష్కారంలో పవన్‌ 'చిత్తశుద్ధి' చూపుతున్నారనీ, తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనీ కిడ్నీ బాధితులు భావించారు.  అయితే, ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ పోరాటం అటకెక్కింది. ఉద్దానం వ్యధ షరామామూలుగానే తయారయ్యింది. చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్‌తో సరిపెట్టింది. ఇంకోసారి, పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం ప్రాంతంలో షో చేశారు.. మళ్ళీ మళ్ళీ 'షో' చేస్తూనే వుంటారు.

Image result for janasena pawan kalyan

ప్రభుత్వానికి ఉద్దానంపై పవన్‌ పెట్టిన డెడ్‌లైన్‌ ఏమయ్యిందో, ఆ తర్వాత ఆ సమస్యపై పవన్‌ పోరాటం ఏమయ్యిందో.. జనసేన తరఫున చెప్పడానికి ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. గత కొంతకాలంగా పవన్‌కళ్యాణ్‌ ఉత్తరాంధ్ర మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్రను ప్రారంభించారు. కొన్నాళ్ళపాటు 'షో' నడిచింది. 'రంజాన్‌' పేరుతో కొన్నాళ్ళు ఆ 'షో'కి విరామం ప్రకటించారు పవన్‌కళ్యాణ్‌. ఇప్పుడేమో, ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమంటున్నారు. ఆ మేధావుల నుంచి ఉత్తరాంధ్ర సమస్యల గురించి తెలుసుకుంటున్నానంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలది ఆత్మగౌరవ సమస్య.. అంటూ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమంతో పోల్చి చూస్తున్నారు పవన్‌కళ్యాణ్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: