Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 9:25 am IST

Menu &Sections

Search

ఆ ఓట్ల కోసం బాబు వ‌ల‌.... దిమ్మ‌తిరిగే ప్లాన్‌

ఆ ఓట్ల కోసం బాబు వ‌ల‌.... దిమ్మ‌తిరిగే ప్లాన్‌
ఆ ఓట్ల కోసం బాబు వ‌ల‌.... దిమ్మ‌తిరిగే ప్లాన్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఓట్ల రాజ‌కీయాలు దండిగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా అన్నివ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన వ్యూహ ర‌చ‌న‌తో ముందుకు సాగుతున్నారు. ఏ ఒక్కరినీ ఆయ‌న వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇక్క‌డ మ‌న‌కు గ‌త పాల‌న‌లో చంద్ర‌బాబుకు ప్ర‌స్తుత చంద్ర‌బాబుకు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది అప్ప‌ట్లో ఉద్యోగులు అంటే.. ఆయ‌న దృష్టిలో సుష్టిగా భోంచేసి వ‌చ్చి ఆఫీస్‌లో రెస్ట్ తీసుకునే బాప‌తు! ఇది ఆయ‌న‌కు సుదీర్ఘ‌కాలంలో పెద్ద చేటు తెచ్చింది. అయితే, ఇప్పుడు ఆయ‌న మారారు. 

andhrapradesh-tdp-ap-cm-chandrababu-naidu-employee

మారిన బాబుగా ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల మందికిపైగా రెగ్యుల‌ర్‌, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. పెన్ష‌న‌ర్ల సంఖ్య‌కూడా దాదాపు 8 ల‌క్ష‌ల‌పైగానే ఉంది. మ‌రి వీరి ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం.గ‌తంలో చేసిన త‌ప్పులే మ‌ళ్లీ చేస్తే.. వీరి ఓటు బ్యాంకు గుండుగుత్తుగా వైసీపీకి చేరిపోవ‌డం ఖాయం. దీనిని గ‌మ‌నించిన బాబు గ‌త ఆరు మాసాలుగావీరిని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారు అడిగిన‌వి.. అడ‌గ‌నివి కూడా చేస్తూ.. వారిని చేర‌దీస్తున్నారు. 

andhrapradesh-tdp-ap-cm-chandrababu-naidu-employee

ముఖ్యంగా ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబును చేర‌దీయ‌డం వెనుక ఉన్న రాజ‌కీయ వ్యూహం కూడా ఇదే. అంతేకాదు, ఒకప‌క్క దేశంలో నేర‌గ‌ణాంకాల‌ను ప‌రిశీలించే జాతీయ నేర విభాగం ఎక్కువమంది అవినీతి అధికారులు ఉన్న రాష్ట్రంగా ఏపీకి ప్ర‌థ‌మ స్థానం క‌ట్ట‌బెట్టింది. ఇది తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన వెంట‌నే చంద్ర‌బాబు 1100 నెంబ‌రుతో ఓ ఫోన్‌ను ఏర్పాటు చేసి స‌మస్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 

andhrapradesh-tdp-ap-cm-chandrababu-naidu-employee

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఉద్యోగుల‌కు కితాబు ఇవ్వ‌డం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీలను సంపాదించుకోవాలని సూచింస్తున్నారు. పేదలను ఎక్కడా దోపిడీ చేసే పరిస్థితి ఉండకూడదు. నీతివంతమైన, అవినీతి రహిత పాలన మా ధ్యేయమ‌ని అంటున్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దుతానని ప్ర‌తిజ్ఞ‌లు సైతం చేస్తున్నారు.  అవినీతిని నిరోధించడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నామ‌ని చెప్పిన చంద్ర‌బాబు..  నూటికి 95 శాతం మంది నిజాయతీగానే ఉన్నారని, 5 శాతం మందిలోనే అవినీతి జబ్బుగా తయారైందని అన‌డం ద్వారా ఉద్యోగుల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకొనేందుకు శ్ర‌మించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


అదేవిధంగా ఉద్యోగుల నుంచి నాయ‌కులను సైతం ఆయ‌న సెల‌క్ట్ చేసుకోవ‌డంపైనా అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఉద్యోగుల ఓట్ల‌ను త‌న‌దైన శైలిలో బాబు బుట్టలో వేసుకుంటుండ‌డంపై ఉద్యోగ సంఘాలే విస్మ‌యం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


andhrapradesh-tdp-ap-cm-chandrababu-naidu-employee
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED