వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపద్యంలో వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న నేపద్యంలో పాదయాత్ర విశేషాలు వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ వ్యవహరించే తీరును తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలవమన్నాడు.
Image result for jagan
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా లిఖితపూర్వకంగా ఇస్తుందో సదరు పార్టీకి మద్దతు తెలుపుతామని అన్నారు. ఈ నేపధ్యంలో 2014 ఎన్నికలలో తాము కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని జగన్ తెలిపారు గత ఎన్నికల్లో చంద్రబాబు తాను అనుభవజ్ఞుడినని చెప్పుకోవడం, మోదీ హవా, మరో సినిమా హీరో మద్దతుతో ఆయన గద్దెనెక్కారని అన్నారు.
Image result for jagan
ముఖ్యంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ఓటమికి అవే కారణాలయ్యాయని అన్నారు. అయితే ప్రస్తుతం అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మార్పులు వచ్చాయని ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు జగన్.
Related image
ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికలలో దేవుడి దయ ప్రజల అండ వల్ల అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడు రైతు బ్రతికేలా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎలా పరిపాలించాడో దాని కంటే మెరుగైన పాలన అందిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పారు వైయస్ జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేదని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు వైసీపీ పార్టీని ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారని అన్నారు జగన్. అయినా కానీ పొత్తుల గురించి మద్దతు గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం వైసీపీ పార్టీకి లేదని జగన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: