సీఎం రమేష్ గత ఎనిమిది రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. కానీ చూడటానికి సీఎం రమేష్ ఉక్కులా కనిపిస్తున్నాడు. అదెలా సాధ్యమో ఎవరికీ అర్ధం కావడం లేదు. నిజానికి రెండు రోజులు అన్నం తినక పోతే మనిషి లక్షణాలు మారిపోతాయి. కానీ రమేష్ మాత్రం దుక్కు లా ఉన్నాడు. అయితే తెర వెనుక ఎదో మతలబు జరుగుతుందని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. 

Image result for cm ramesh

నిరాహార దీక్ష చేస్తే రెండో రోజుకే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఇది మేం చెబుతున్న మాట కాదు. ఇది సైన్స్. అలాంటిది 53 ఏళ్ల ఉక్కు రమేష్ అలియాస్ సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే జీవక్రియలన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. కడుపు ఖాళీగా ఉన్న వ్యక్తికి జీవక్రియలు ఎలా జరుగుతున్నాయని మమ్మల్ని అడగొద్దు. దీన్నే సాంకేతికంగా చెప్పుకోవాలంటే వైద్యరంగంలో మెడికల్ మిరాకిల్ అంటారు. 

Related image

బరువు తగ్గడం కోసం నేను కూడా ఓ 5 రోజులు నిరాహార దీక్ష చేస్తానంటూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ కామెంట్ చేసి అభాసుపాలయ్యారు. అయితే సీఎం రమేష్ లా నిరాహార దీక్ష చేస్తే 5 కిలోలు తగ్గడమేమో కానీ, మరో 5 కిలోలు పెరిగే ప్రమాదముంది. అవును.. తన నిరాహార దీక్షలో భాగంగా సీఎం రమేష్ ఎప్పటికప్పుడు బాత్రూమ్ కు వెళ్తున్నారు. కానీ ఆయన బాత్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి, పక్కనే ఉన్న కలెక్టర్ గదిలోకి వెళ్తున్నారు. వెళ్లిన వ్యక్తి మళ్లీ బయటకు వచ్చేసరికి గంటల సమయం పడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ ఛానెల్ బయటపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: