టీడీపీ వారు వీడియో లో అడ్డంగా బుక్ అవ్వడం ఇదేమి కొత్త కాదు. ఇంతక ముందు వారి నాయకుడు కూడా ఇలాగే ఒక వీడియో లో దొరికి పోయి చివరికీ ఆ వాయిస్ నాది కాదు అదంతా కట్ కాపీ అని కవర్ చేసాడు. ఇప్పడూ కూడా సేమ్  రిపీట్ అయింది. టీడీపీ ఎంపీలు దీక్ష గురించి అపహేళన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. దీనితో టీడీపీ మళ్ళీ ఇరకాటం లో పడింది. 

Image result for chandrababu naidu

అయితే,  కట్‌ పేస్ట్‌' టెక్నాలజీ ఉపయోగించి, టీడీపీ వ్యతిరేకులే ఆ వీడియోని మీడియాకి లీక్‌ చేశారన్నది టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి ఉవాచ. ఎంపీలకు అంతకు ముందు క్లాస్‌ తీసుకుని, ఆ తర్వాత 'అబ్బే, ఆ వీడియో జస్ట్‌ మార్ఫింగ్‌ అంతే.. ఆ వీడియోకీ, అందులోని మాటలకీ సంబంధమే లేదు..' అని తేల్చేశారు చంద్రబాబు. టీడీపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా, వివాదాన్ని తెలివిగా డీల్‌ చేసిన చంద్రబాబు, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోండి అంటూ క్లాస్‌ తీసుకోవడం గమనార్హం.

Image result for chandrababu naidu

అంటే, దానర్థమేంటి.? అదంతా నిజమేనని ఆయన ఒప్పుకున్నట్టే కదా.!  ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయ్‌.. ఇవన్నీ బీజేపీ స్పాన్సర్డ్‌ కుట్రలు.. వైఎస్సార్సీపీ, జనసేన - బీజేపీకి పెయిడ్‌ కన్సల్టెంట్లు..' అంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, వీడియో 'కట్‌ పేస్ట్‌' వివాదంపై తనదైన స్టయిల్లో వివరణ ఇచ్చారు. 'నేను అనని మాటల్ని నావిగా ప్రచారం చేశారు..' అంటూ మరో ఎంపీ మురళీమోహన్‌ వాపోయారు. వీడియోలో అడ్డంగా దొరికిపోయింది ఆయనే మరి.! 

మరింత సమాచారం తెలుసుకోండి: