ముఖ్యమంత్రి చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోతోంది. దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు వుంటున్నాయి. జగన్ పాదయాత్ర, పవన్ ఉత్తరాంధ్ర టూర్ పైన బాబు తనకున్న భయాన్ని చెప్పకనే చెప్పుకున్నారు. వాళ్ళు చేసే పోరాటాలకు నేను జడుసుకుంటానా అంటూ సీఎం ప్రశ్నించడమే ఆయనకున్న ఆందోళనకు అద్దం పడుతోంది.


ప్రతిపక్షాలది పనికిమాలిన రాజకీయం :


తాను నిరంతరం అభివ్రుధ్ధి కోసం తపన పడుతూంటే విపక్షాలు పనికిమాలిన రాజకీయం చేస్తున్నాయని బాబు విరుచుకుపడు తున్నారు. వాళ్ళను అసలు నమ్మొద్దంటే నమ్మొద్దని జనాలను విన్నవించుకుంటున్నారు.ఏపీకి నిధులివ్వకుండా అడ్డుపడుతున్న  బీజేపీపై పల్లెత్తు మాట అనని జగన్, పవన్ ప్రజలకు వ్యతిరేకమట. తన పోరాటానికి కలసి రాని వాళ్ళను పక్కన పెట్టేయాలని బాబు పిలుపు ఇస్తున్నారు.


ప్రతిపక్షం అవసరమా :


తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై ఎంతటి గౌరవం వుందో ఆయన వ్యాఖ్యలే తెలియచేస్తున్నాయి. తాను ఎంతో శ్రమ పడి రాష్ట్రాభివ్రుధ్ధికి పాటుపడుతూంటే ప్రతీ దానికీ అడ్డుతగులుతున్న ప్రతిపక్షాలు అసలు అవసరమా  అని బాబు బేలగా జనాలనే అడుగుతున్నారు. వారి వూసే లేకుండా ఏకపక్షంగా తనకే ఓటు వేయమంటున్నారు. మొత్తానికి అనుభవం కలిగిన సీయం ఇటువంటి మాటలు మాట్లాడుతూంటే విస్తుబోవడం జనం వంతు అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: