సాధారణంగా చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి.  వారు ఏడ్చినా..నవ్వినా..చిలక పలుకులు పలికినా మనసుకు హత్తుకుంటాయి.  తాజాగా ఓ రెండేళ్ల బాలుడు చిట్టిపొట్టి పాదలతో డ్యాన్స్ చేస్తూ..అందరినీ ఆకట్టుకున్నాడు. పెద్దవారు సైతం కొన్ని సార్లు తడబడతారేమో కానీ ఈ బుజ్జాయి మాత్రం ఏమాత్రం తడబడకుండా..మ్యూజిక్ కి అనుసందానంగా డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.

తన నీడను అనుసరిస్తూ మ్యూజిక్‌కు తగ్గట్టుగా కాళ్లను ఆడిస్తూ సందడి చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆల్బెర్టా‌లోని కేమ్రోజ్‌లో నేషనల్ ఇండిజెనస్ పీపుల్స్ డే సందర్భంగా సాంపద్రాయ ఉత్సవాలను నిర్వహించారు.

పాట, ఆట అంటే ఎంతో ఇష్టపడే లిటిల్ డాన్సర్ ఆల్బర్ట్ అప్సాసిన్ చించేశాడు. తనకు వచ్చిన తొలి అవకాశాన్ని ఇలా డాన్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: