జగన్ జాతీయ పత్రిక అయిన హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చినపుడు జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా ఆ జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. కాళ్ళకు బొబ్బలచ్చి చీము కారే దశలో ఉన్నాయి. ఎంతో ఇన్ఫెక్షన్ కి గురయినా కానీ ఇంత నొప్పితో ఎలా నడుస్తున్నారని ఆ ప్రతినిధి ప్రశ్న వేసాడు. దాంతో జగన్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళకు రోజు ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంటుందని ఎంత నొప్పి ఉన్నా పాదయాత్రలో  ప్రజలు ఎదురొచ్చి  పలుకరించగానే ఆ నొప్పి మటుమాయం అవుతుందనని జగన్ చాల తేలిగ్గా చెప్పటంతో  ఆశ్చర్యపోవటం ఆ విలేఖరి వంతయ్యింది.

మొత్తానికి ఆ ఫోటోలో జగన్ కాళ్ళకు బొబ్బలతో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫోటో ని చూసిన కొందరు జగన్ చాల మొండిమనిషని ఏదైనా అనుకుంటే చేసి తీరతాడని అందుకే పాదయాత్ర చేయటమే లక్ష్యంగా ఉన్న జగన్ కాళ్లకు బొబ్బలతో  తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది.

అది చూస్తే ఏవరికైనా గుండె కరిగిపోతుంది.. కానీ ఆ నొప్పి ని బేఖాతరు చేస్తూ పాదయాత్ర చేయటానికే మొగ్గు చూపుతున్నాడని కొందరు సన్నిహితులు వాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులలో కూడా ప్రజల్లో ఉండటం కోసం ఇంతగా అంకితభావం చూపుతారా అని కొందరు ప్రజలు గుసగుసలాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: