నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కమెడియన్ పొలిటిషన్ తయారవుతున్నాడని చెప్పవచ్చు. ఒక పక్క చంద్ర బాబేమో లోకేష్ ను టీడీపీ లో నెం.1 నాయకుడిలా తీర్చి దిద్దాలనుకుంటే అతని వాక్చాతుర్యం తో అందరినీ నవ్వుకునేలా చేస్తున్నాడు. ఒక సారి రెండు సార్లు అయితే ఎదో పొరపాటు అనుకోవచ్చు . ప్రతి సారి బుక్ అవుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. మళ్ళీ లోకేష్ తడబడ్డాడు. 

Image result for nara lokesh

"ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిపైన ఆరోపణలు చేస్తారు. నేను సభాముఖంగా వాళ్లకు సవాల్ విసురుతున్నాను. అయ్యా.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని మోడీని నిలదీయండి. మన ముఖ్యమంత్రిని కాదు." లోకేష్ తాజా సవాల్ ఇది. కాకినాడలో ధర్మపోరాట సభ పేరిట టీడీపీ నిర్వహించిన సొంత ప్రచార కార్యక్రమంలో లోకేష్ ఇలా సవాల్ విసిరారు. అంతా బాగానే ఉంది కానీ అసలు లోకేష్ అన్న మాటల్లో సవాల్ ఎక్కడుందనేది అసలు ప్రశ్న. 

Image result for nara lokesh

ఓవైపు ఎప్పటికప్పుడు జగన్, కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబుతో పాటు మోడీ కూడా కారణమని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పాటు మరే పార్టీతో పొత్తు ఉండదని విస్పష్టంగా చెబుతున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. కానీ లోకేష్ మాత్రం ఇంకా గతంలోనే ఉండిపోయారు. వర్తమానంలోకి తొంగి చూడడం లేదు. వాస్తవంగా ఏం జరుగుతుందో లోకేష్ కు అర్థంకావడం లేదు. ఇప్పటికీ ఆ మాసిపోయిన పాత సవాల్ నే విసురుతూ జనాల మధ్య అభాసుపాలవుతున్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండదని పత్రికాముఖంగా జగన్ చెబుతుంటే.. మోడీ చెప్పినట్టు జగన్ నడుచుకుంటున్నారంటూ లోకేష్ అర్థంలేని ఆరోపణలు చేస్తుంటే జనం నవ్వుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: