ఇప్పడు దేశ రాజకీయాల్లో ఎవరి నోట విన్న ముందస్తు ఎన్నికల గురించే, అయితే ఇప్పడు అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తే మనకు ఎంత వరకు లాభమని, బేరీజు వేసుకొనే పనిలో ఉన్నారు. అయితే కొన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తే, కొన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ద పడే పరిస్థితిలో లేరని చెప్పాలి. ఒక పక్క తెలంగాణ సీఎం ముందస్తు ఎన్నికలకు నేను సిద్దమని ప్రకటిస్తే ఏపీ లో మాత్రం సీఎం చంద్ర బాబు ఎందుకో జంకుతున్నాడని చెప్పవచ్చు. 

Image result for nara chandrababu naidu

ఏపీ విష‌యానికొస్తే పైకి ముంద‌స్తుకు సై అంటున్న చంద్ర‌బాబు, లోలోప‌ల మాత్రం ముంద‌స్తు రావ‌ద్ద‌ని కోరుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలేమీ లేవు.పైగా ఇచ్చిన హామీల్లో కూడా ఏ ఒక్క‌టీ ప‌రిపూర్ణంగా అమ‌లు చేయ‌లేదు. దానికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు, ఏపీని అభివృద్ధి చేస్తాం, న‌వ్యాంధ్ర‌గా మారుస్తాం,ప్ర‌త్యేక‌హోదా సాధిస్తాం, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేస్తామంటూ బీరాలు ప‌లికారు.కానీ, స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసం ప్ర‌త్యేక‌హోదా,విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను మోదీకాళ్ల కింద తాక‌ట్టు పెట్టార‌న్న అప‌వాదును మూట‌క‌ట్టుకున్నారు.

Related image

ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యంగా ఉన్న‌న్ని రోజులు ఏనాడు కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌ని తెలుగుదేశం పార్టీ, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చాక మ‌రోసారి మోసం చేసేందుకు కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌త్యేక‌హోదాను సాధించుట‌లో పూర్తిగా విఫ‌లం అయ్యార‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజీపీ-జ‌న‌సేన‌లు కూట‌మిగా ఏర్ప‌డ‌టం మూలంగానే టీడీపీకి ఓట్లేసారని, ఎవ‌రికివారుగా పోటీ చేసి ఉంటే, క‌చ్చితంగా జ‌గ‌నే గెలిచేవాడ‌న్న చ‌ర్చ ఇప్పుడు ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: