తిరుమల లో వేల కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయని, రమణ దీక్షితులు ఆరోపణలు గుప్పిచ్చిన సంగతీ తెలిసిందే. అలాగే టీడీపీ సర్కార్ కూడా రమణ దీక్షితుల మీద ఎదురు దాడికి దిగారు. అయితే ఈ వ్యవహారం మీద కొంతమంది కోర్ట్ కి వెళ్ళినారు. కోర్ట్ వారి పిటిషన్ ను స్వీకరించింది. దీనితో టీడీపీ సర్కార్ చిక్కుల్లో పడింది. ఇప్పడు టీడీపీ ఖచ్చితముగా కోర్ట్ ఆదేశాలను పాటించాల్సిందే. 

Image result for tirumala temple

ఈ నేపథ్యంలో వెంకన్న నగలు మాయం,  శ్రీవారిపోటులో తవ్వకాల కలకలం, పాలకమండలి నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఉమ్మడి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పురాతన ఆస్తులను, స్వామివారి నగలను కాపాడేందుకు సత్వరమే తగిన ఆదేశాలు ఇవ్వాలని అనిల్ కుమార్, గోస్వామి అనే భక్తులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. 

Image result for tirumala temple

అనిల్ - గోస్వామి పిటిషన్ లోని ఆరోపణలపై టీటీడీ పాలకమండలి, ఈఓ, ఏపీ ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని హైకోర్టు నోటీసులు పంపించబోతోంది. మొన్నటివరకు రమణ దీక్షితుల ఆరోపణలపై బుకాయించింది చంద్రబాబు సర్కార్. అతడిపై నిలువునా బురదజల్లింది. ఈసారి హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. ప్రభుత్వ వివరణ నచ్చకపోతే, ఈ వ్యవహారంపై హైకోర్టు విచాణ కమిటీ వేసే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: