అసలు నారా చంద్రబాబు నాయుణ్ణి తమతో సిద్ధాంతిక పొంతనే లేని బిజెపితో కలసి పనిచేయమన్నది ఎవరు?  పవన్ కళ్యాణ్ తో దోస్తీ కట్టమన్నది ఎవరు? ప్రజలు కాదు కదా? ప్రజల ముందుకు బిజెపి-టిడిపి-పవన్ కళ్యాన్ మైత్రి ప్రాతిపదికన రాజకీయంగా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇటు మీరు, అటు వారు, కలసి ప్రజల కిచ్చిన వాగ్ధానాలు మరచిపోయారు.


రేపు 2019ఎన్నికల్లో మీచేతికి ప్రజలు చిప్ప ఇస్తారని-నాలుగేళ్లు అటు కేంద్రంలో మీరు, ఇటు రాష్ట్రంలో వారు, పాలన ప్రయోజ నాలు పొంది నేడేమీ చేయలేక యూటర్న్ తీసుకొని “యూటర్న్ అంకుల్ “ అనే మీ నామం అనేకసార్లు సార్ధకం చేసుకున్నా రు. 2014 ఎన్నికల ముందు నుండి మీరు అలవిమాలి చేసిన 600 పైగా వాగ్ధానాలు అధికారం లోకి రాగానే కావాలనే గాలికి వది లేశారు. చివరకు చతికిలబడ్దాక నేడు బిజెపి -పవన్ లపై వాగ్భాణాలు.



మీ చరిత్ర తెలిసిన వారెవరూ మీతో జట్టు కట్టరు. మీరు ఏ పార్టీ తో స్నేహం చేయకుండా ఉన్నారు? మీ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయజీవితంలో.  మీ రాజకీయ జీవితం కాంగ్రెస్ తో ఎమెర్జెన్సీ కథానాయకుడు సంజయ్ గాంధితో, మీ అతి ఘాడ మైత్రి నుండి మొదలైన రాజకీయ జీవితంలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రాధాన్యం వహించిన ప్రతి రాజకీయ పార్టీతో మీరు జట్టు కట్టారు మైత్రి నెరిపారు. మీ స్నెహంతో వాళ్ళంతా మునిగిపోగా వాళ్ళ పతనం అనే సోఫానాల మీద అపర చాణక్యుడని మీ కులజనం మీ కుల మీడియా పోగుడుతూ ఉండగా,  మీరు మీ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ జీవితం కొనసాగిస్తూ వస్తున్నారు. మైత్రి అంటే ఇరు పక్షాలు క్షేమం అనేలా ఉండాలి. కాని మీతో స్నేహం వారికి క్షామం- మీకు క్షేమం అనేలా కొనసాగింది.

chandrababu lokesh about bjp and modi కోసం చిత్ర ఫలితంనాలుగేళ్ళు సుజానా చౌదరి, సిఎం రమేష్ లు వారివారి రాజకీయ ఆర్ధిక వ్యాపార నేరాల నుండి సంరక్షణ ప్రయోజనాలు పొందగా వీరితో పాటు అశోక గజపతిరాజునును కలుపుకొని మీరు రాజకీయ ప్రయోజనాలు పొందారు. మీ వైఫల్యాలన్నింటిని ప్రతిపక్షం వైసిపిపై స్వపక్షంలోని విపక్షం బిజెపి-పవన్ పై నెట్టేసి ఏమీ తెలియని పత్తిత్తులా మీకే స్వంతమైన మీకే సాధ్యమైన కుతంత్రం మొదలెట్టారు. మొత్తం నాలుగేళ్ళు ప్రజలకు "విశ్వనగరం అమరావతి" సినిమాని మీ నిర్మాణ సారధ్యం, రాజమౌళి దర్శకత్వంలో  జనాలకు కళ్ళలో కలలో మాత్రమే భ్రమరావతి గా చూపిస్తూ ఇలలో మాత్రం ఒక ఇటుకైనా పదకుండా కథ నడిపించేశారు.


అంటే కాదు, దేశంలో కేంద్రం నుండి రాష్ట్రం పొంది నంత ప్రయోజనాలు వేరే ఏ రాష్ట్రం పొందలేదని, ప్రయోజనాల ప్రవాహం అలా కొనసాగుతూ వస్తుందని ప్రత్యేక హోదా సంజీవని కాదని-ప్రత్యేక పాకేజీయే, సర్వస్వం అనీ వేనోళ్ళ శాసనసభతో సహా పలు వేదికల మీద నినదించిన మీ కథ కథాసారిత్సాగరమంత గొప్పది.

chandrababu lokesh about bjp and modi కోసం చిత్ర ఫలితం

ఈ నాలుగేళ్లు మీరు నిప్పని చెపుతూ వచ్చారు - పోలవరం తీరు, అమరావితి హోరు చూస్తే మీరెంత తుప్పో - జనాన్ని ఎంత కాలమైనా నమ్మిస్తూ వంచించ గలరో తెలుస్తూనే ఉంది. నమ్మకద్రోహం చేయటంలో మీది అందెవేసిన చెయ్యని వెన్నుపోటు పాజకీయాల్లో మీరు నిజంగా ఆరితెరారని అనేది ఇప్పుడు బిజెపితో పాటు భారతావనికి విశదమైంది.  రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా చేస్తున్న విదేశీ పర్యటనలు చర్చనీయాంశంగా మారాయి. వెళ్లిన ప్రతీచోటు నుంచి వెల్లువలా ₹ వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు ఆయన చేస్తున్న ప్రకటనలు ఎక్కడా వాస్తవరూపం దాల్చడంలేదు.


2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన మొత్తం 13 దేశాల్లో పర్యటనలు చేశారు. వీటిలో సింగపూర్, జపాన్, చైనా, బ్రిటన్, అమెరికా, దుబాయ్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఎక్కువసార్లు పర్యటించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా ఏపి రాష్ట్రాన్ని మార్చేస్తామని చెప్పడం తప్ప చేసింది ఏమీలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కోట్లాది రూపాయల ఖర్చుతో చేస్తున్న విదేశీ పర్యటనలవల్ల ఇప్పటివరకు సాధించిందేదేమిటి? అన్న దానిపై ఇప్పుడు అధికారవర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. “దావోస్‌” లో జరిగే "ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు" కు వరుసగా నాలుగేళ్ల నుంచి హాజరవుతున్నా ఎటువంటి ఫలితం కనిపించడంలేదు. ఆయన జరుపుతున్న పర్యటన ల్లో ఎక్కువగా ఉపయోగంలేని సదస్సులు, సమావేశాలే జరుగుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు గత జనవరిలో జరిగిన దావోస్‌ సదస్సులో రాష్ట్రం లో ఆయిల్‌-రిఫైనరీ ఏర్పాటుకోసం  "సౌదీ అరామ్‌ కో సంస్థ" తో జరిగిన చర్చలను ఉదహరిస్తున్నారు. సౌదీ అరామ్‌ కో సంస్థ ప్రతినిధులను ఇక్కడికి రప్పించారు. కానీ, అవేమీ ఫలప్రదం కాలేదు. మరో వైపు ఇదే సంస్థ 2012 లోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకు న్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు. 


చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే రాజధాని "మాస్టర్‌ ప్లాన్‌" కోసం సింగపూర్‌ వెళ్లి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అక్కడికెళ్లినా పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌ లోని "సెంటోసా టూరిజం స్పాట్‌" లా విజయవాడలోని  "భవానీ ద్వీపం" లాగా మార్చేస్తామని ఆ దేశం వెళ్లినప్పుడు ప్రణాళికలు రూపొందించినా ఇప్పటివరకూ దానిపై అడుగు ముందుకుపడలేదు. అక్కడి నుంచి పెట్టుబడులు తేకపోగా రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు ను ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే రీతిలో ఆ దేశ కంపెనీలకు అప్పగించడంపై దుమారం రేగింది. 

chandrababu lokesh about bjp and modi కోసం చిత్ర ఫలితం

జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్‌ భాష ను ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘై లా అమరావతి నిర్మిస్తామని, జపాన్‌ వెళ్లినప్పుడు టోక్యో లాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లి విశాఖపట్నానికి టెంపుల్‌-టన్‌ సంస్థను తీసుకొస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ నిర్మిస్తామని చెప్పారు.  


గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మళ్లీ మొన్న ఫిబ్రవరిలో  వెళ్లారు. భాగస్వామ్యసదస్సు ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. కానీ, అబుదాబికి చెందిన పారిశ్రామికవేత్త బీఆర్‌ శెట్టితో లావాదేవీల నేపథ్యంలోనే ఆయన ఈ పర్యటన జరిపినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత జనవరిలో దావోస్‌ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన మధ్యలో అబుదాబిలో ఆగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

lokesh about modi కోసం చిత్ర ఫలితం

గత ఏడాది అక్టోబరులో జరిగిన దుబాయ్‌ పర్యటనలో చంద్రబాబు కార్యక్రమాలన్నీ బీఆర్‌ శెట్టి పర్యవేక్షిం చారు. దుబాయి నుంచి రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్‌ వెళ్లిన చంద్రబాబు బీఆర్‌ శెట్టిని కూడా తీసుకెళ్లడం గమనార్హం. నాలుగేళ్లలో చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయి నా ఖజానాకు మాత్రం బాగా దెబ్బేసింది. రాష్ట్రం చమురు బాగా వదిలింది.


దేశంలో ఏ సీఎం వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమనాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమనాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌ పార్కింగ్‌ చేసి ఉంటుంది. పార్కింగ్‌ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని, అలాగే పైలట్లకు స్టార్‌ హోటల్స్‌ లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


రెగ్యులర్‌ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్‌ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ కలం తాను రాసిన “మేలుకొలుపు” పుస్తకంలో తప్పుబట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. ఇక సీఆర్డీఏ అధికారులు సహా ఇతర అధికార యంత్రాంగం విదేశీ యాత్రలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రాని కి ప్రయోజనం కలిగితే తప్ప విదేశీ యాత్రలకు అనుమతించేదిలేదని సీఎస్‌ స్పష్టం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్‌ -షోల నిర్వహణకు బడ్జెట్‌ లో రూ.62 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది.


ఇక తనయుడు లోకేష్ విషయాని కొస్తే మాటలు కోటలు దాటితున్నాయి. తెలిసి తెలియని మాటలు. ప్రజల్లో నుంచి కాకుండా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రధానిపై - తన స్థాయికి మించిన విమర్శలు. అపస్వరాల సార్వభౌముడు - గూగుల్ నిర్వచించిన పప్పు భారత ప్రధానిని ఈ స్థాయిలో విమర్శించటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

lokesh about modi కోసం చిత్ర ఫలితం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కాకినాడలో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో శుక్రవారం "తెలుగు జాతితో పెట్టుకోవద్దు" అని ఆయన మోడీని హెచ్చరించారు. తెలుగు జాతితో పెట్టుకున్న వాళ్ళు మాడిమసై పోయారని అన్నారు. "మీరు పెట్టుకుంటే మసైపోతారు" అని  ఆయన ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా 2019లో చూపించ బోతున్నా మని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరెంద్రమోడీని నిలదీయాలని ఆయన అన్నారు. వైసిపి ఎంపీల రాజీనామా అంతా డ్రామా అని లోకేష్ అన్నారు.


సామాన్యఙ్జానం ఉన్న ఏ తెలుగువాడూ - లోకేష్ స్థాయికి ఈ తీరు తగదంటారు. "జాతికే జోకింగ్ స్టాక్"గా మారిపోయారీయన. కనీసం 35యేళ్ల వయసులో ఉన్న సాధారణ పౌరునికి ఉన్న ‘ఫిట్నెస్ ఆశక్తి’ కూడా లేని ఈయన యువతకు ఎలా మార్గదర్శకుడు కాగలడు. 

lokesh about modi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: